Posts

Showing posts from August, 2017

గలతీయులకు

Image
Galatians(గలతీయులకు) 4:6,7,8,9,11,12 6.మరియు మీరు కుమారులై యున్నందుననాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. 7.కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. 8.ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులై యుంటిరి గాని 9.యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల? 11.మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. 12.సహోదరులారా, నేను మీవంటివాడనైతిని గనుక మీరును నావంటివారు కావలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. 

వ్యక్తిత్వ వికాస సూత్రాలు

                    వ్యక్తిత్వ వికాస సూత్రాలు 🌺నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది. చీకటితో పోరాడితేనే గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారుతుంది. మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది. జీవితంతో పోరాడితేనే మానవత్వం ఉన్న మనిషిలా మసరుతాము... 🌺ఐసులా కరిగిపోయే ఐశ్వర్కం కన్నా, మాటలా నిలిచిపోయే మంచితనమే గొప్పది. 🌺 కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే....... 🌺 మంచి ఎక్కడ వున్నా పరిగ్రహించు. చెడు ఎక్కడ ఉన్నా పరిత్యజించు. 🌺 నిన్ను చూసి చప్పట్లు కొట్టే పది వేళ్ళ కన్నా కన్నీరుతుడిచే ఒక్క వేలు మిన్న.... 🌺 మేలు చేయక పోయిన పరవాలేదు. ఎవరికి కీడు మాత్రం చేయకూడదు. 🌺 నిజమైన స్నేహితుల్ని సంపాదించుకోవడం అన్నిటికంటే కష్టతరం. 🌺 సంతృప్తిగలవాడు మట్టిని ముట్టినా బంగారమవుతుంది. 🌺 పుస్తకాలు, స్నేహితులు కొద్దిగా ఉన్నా మేలైనవిగా ఉండాలి. 🌺 ప్రపంచంలో నువ్వొక సాధారణ మనిషివే కావచ్చు. కానీ కనీసం ఒక్కరికైనా నువ్వు ప్రపంచమంత గొప్పగా కనిపించేలా జీవించు. 🌺 మనం పక్షుల్లా గాలిలో ఎగరడం, చేపల్లా నీటిలో ఈదడం నేర్చుకున్నాము. కానీ...

రాకడ ముంగుర్తులు

రాకడ ముంగుర్తులు 1.నేనే క్రీస్తు ననువారు వత్తురు (మత్తయి 24 : 5) 2.అబద్ద ప్రవక్తలు వత్తురు (మత్తయి 24 : 11) 3.యుద్ధములు (మత్తయి 24 : 6) 4.కరువులు (మత్తయి 24 : 8) 5.గొప్ప విపత్తులు (లూకా 21 : 10-11) 6.ఉద్యోగములు దొరకవు (జకర్యా 8 : 10) 7.నోవాహు దినమువలె నుండును (మత్తయి 24 : 37-39) 8.తిండి దొరకదు (విలాప వాక్యములు 4 : 5) 9.ఇల్లు కట్టుట, నారు నాటుట ,అమ్ముట (లూకా 17 : 28-30) 10 ధనము విస్తరించుట (యాకోబు 5: 1-10) 11.అక్రమమువృద్ధి (మత్తయి 24: 10) 12.ధైర్యము చెడికూలుదురు (లూకా 21 : 25,26) 13.ఒకనినొకడు అప్పగించును (మత్తయి 24 : 10) 14.వాక్య కరువు (ఆమోసు 3 : 11) 15.తల్లిదండ్రుల వలన, సోదరుల వలన (లూకా 21 : 10-17) 16.మనుష్యుల శవములు రాలుట (యిర్మియా 9 : 22) 17.కల్పననా కథలకు తిరుగు కాలము (2 తిమోతి 4: 3-4) 18.నామకభక్తి (2 తిమోతి 3 : 5) 19.వీధి రథములు (బస్సులు) (నహోము 2 : 4) 20.ప్రవచన అర్ధము చెప్పువారు లేతురు (దానియేలు 12 : 4) 21.యూదుల రాకవలన ఆందోళన (యెహెజ్కే 38 : 16) 22.పరిశుద్ధాత్మ బాప్తిస్మము క్రీస్తు రాకడలో అందరూ పాలుపొందవలెను (అ.కా. 1 : 4-5) 23.అతుకనికాలము (మన కాలము) (దానియేల...

ప్రార్థన

                        ✳.......ప్రార్థన .......✳ ✳ తగ్గింపుమనసుతో చేసే ప్రార్ధన...✍ "సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచుదేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను." లూకా 18:13 ▪సమాజంలో నీచమైనస్థితి. ▪అంటరాని వాడు. ▪వెలివేయబడిన జీవితం. 👉నేను దేవాలయంలో అడుగు పెట్టడానికి అర్హుడను కాను. 👉 ఆయనను ప్రార్ధించే అర్హత నాకు లేదు. అని అనుకొని వుంటే? 🔺ఈరోజు మనము ఆ సుంకరిని గురించి మాట్లాడుకోవలసిన అవసరంలేదు. 👉ప్రార్ధించాలి అనే తలంపు మనకువస్తే చాలు. 🔺మెల్లగా సాతాను మనలోనికి ప్రవేశించి, 🔺నీవు ఆ తప్పు చేసావ్, ఈ తప్పు చేసావ్ అంటూ... నీవు ప్రార్ధించినా, దేవుడు వింటాడా? నీ టైం వేస్ట్ తప్ప అంటాడు. వాడు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది మనకు. 🔺సరేలే! మనల్ని మనము సరిచేసుకున్నాక ప్రార్ధన చేద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. 👉 ఇక వాడు గ్రేండ్ సక్సస్ అంటూ గంతులువేస్తాడు. 👉ప్రార్ధన మానేసాము అంటే? దేవునితో మాట్లాడడం మానేసినట్లే. 👉దేవునికి దూరమై దయ్యముతో సహవాసం ప్రారంభమయిన...

ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు

ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు                     దేవుని ఆశీర్వాదములు భౌతికమైనవి వున్నవి (ద్వితి 28)ఆత్మసంబంధమైనవి వున్నవి. కొత్తనిబంధన లో యేసుప్రభువు చెప్పి నట్లుగా భౌతిక దీవెనులు చెడ్డవారికి మంచివారికి అందరికి సమానముగానే అనుగ్రహింప బడును (మత్తయి5:45)ఆరోగ్యము,ఐశ్వర్యము,అధికారము,జ్ఞానము,బలము భౌతికమైనరీతిలో అందరికి నరుల కష్ఠముతో కాకుండా భూమి మీద కృప జూపు దేవుని వలననే లభించు చున్నవి.(యిర్శియా9:24,సామెతలు10:22)        అయితే ఆత్మీయ ఆశీర్వాదములు క్రీస్తు నందు ఉన్నవారికి మాత్రమే లభించుచున్నవి. భౌతిక ఆశీర్వాదములు ఈలోకములో మన జీవితకాలమునకు తాత్కాలికంగా ఇవ్వబడితే, ఆత్మీయదీవెనలు శాశ్వతముగా ఇవ్వబడుచున్నవి.దురాశ ను అనుసరించుట వలన లోకములోని భ్రష్ఠత్వమును ఈ వాగ్ధానముల మూలముగాతప్పించుకొని దేవుని స్వభావములో పాలివారు అగునట్లుగా వాటిని అనుగ్రహించెను.(2పేతురు1:4)        దేవునిచేత ఏర్పరచబడుట ఒక ఆశీర్వాదమే ,పాపక్షమాపణ,తనచిత్తమును గూర్చిన మర్మము మనకు ముందే తెలవడం ఆశీర్వాదములే పరలలోకములో ఉన్నవి భూమిమీద వున్నవి  స...

అంత్యదినాలలో మానవుల పరిస్థితి

 అంత్యదినాలలో మానవుల పరిస్థితి  👉 నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని బైబిల్ చెపుతుంది. 🔺 ఎవరైతే ఆసంగతి గ్రహించి, సువార్తను నమ్మి యేసునందు విశ్వాసము ఉంచుతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. పరిశుద్దులౌతారు. 👉 ఈనాడు మనుష్యులు మోసం చేయడంలోను అబద్దాలు చెప్పడంలోను పోటి పడుతున్నారు. 👉 ఎవరు ఎంత తెలివిగా మోసంచేస్తే అంత గొప్పగా ఫీలవుతున్నారు. 👉 కాలం మారిందని అందరు అనుకొంటున్నారు కాని మారింది కాలం కాదు మానవులు. 👉 చాలా విపరీతంగా మానసికంగాను భౌతికంగాను వారిని వారే చెరిపేసుకుంటున్నారు. 🔺 సత్యం తెలిసిన కూడా కళ్లకు కట్టినట్లుగా కనబడుతున్నా కూడా చాలా బాగా అర్ధమైనా కూడా దానికి కొంచం అయినా విధేయత (రెస్పాన్స్) చూపలేని తరం ఇప్పుడు వచ్చింది. “ఈ ప్రజలు కన్నులార చూచి చెవులారా విని మనస్సార గ్రహించి నా వైపు తిరిగి నావలన స్వస్థత పొందుకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసికొని యున్నారు అని పరిశుద్ధాత్మ యెషయాప్రవక్తద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే.” (అ.కా 28:27). 🔺 దేవుని వాక్యంలోని సత్యం తెలియపరచ బడినప్పుడు మనిషిలో పరిశుద్దాత్మ ఉంటే ఆ సత్యాన్న...
                        ఆలోచించు ఆలోచించు ఆదికాండము నుంచి ప్రకటన గ్రంధము వరకు 1. దేవుడు తన వద్దకు వచ్చిన వారిని తోసివేయడం చూచితివా? 2. దేవుడు ఎవరికైనా ఇచ్చిన సలహా వారికి సహాయము చేయకుండా తప్పిపోయిందా? 3. దేవుని నమ్మిన ఎవరైనా నాశనము అవటం చూచితివా? 4. దేవుడు సైతం తప్పించలేని ఏమి చేయలేని పరిస్థితులు చూచితివా? 5. దేవుని చిత్తమునకు లోబడి సంపూర్ణముగా నష్టపోయిన వారిని చూచితివా? 6. దేవుని నమ్ముకొని ఆశీర్వదింప బడని వారిని చూచితివా? 7. దేవుని నమ్ముకొని శాంతి లేకుండా జీవించిన వారిని చూచితివా? 8. దేవుడు మాట ఇచ్చి తప్పిపోవటం చేయకుండా ఉండటం చూచితివా? 9. దేవుడిని నమ్ముకొనిన వారు తమ శత్రువుల చేతికి విడువబడటం చూచితివా? 10. దేవుడు ఎవరినైనా కష్టములలో విడచి ముఖము త్రిప్పుకొనుట చూచితివా? 11. దేవుడు తనంతట తానే చేయి విడుచుట చూచితివా? 12. దేవుని నమ్ముకొన్న వారికి ఏ మేలు అయినా కొదువగా ఉండటం చూచితివా? 13. దేవుడు ఎవరికీ అయినా అన్యాయము చేయటం చూచితివా? 14. దేవుడు నీతి తప్పి ప్రవర్తించటం చూచితివా? 15. దేవుడు తన సంతోషం కోసం ఎవరిని అయినా హింస...

బిక్షమెత్తుకునే కుంటివాడు దేవుడు చేసినమేలుని బట్టి ఏమిచేశాడో తెలుసా

బిక్షమెత్తుకునే కుంటివాడు దేవుడు చేసినమేలుని బట్టి ఏమిచేశాడో తెలుసా ? పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు ఉండెను వాడు దేవాలయములోనికి వెళ్లువారిని భిక్షమడుగుటకు ప్రతిదినము శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉండెను పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింప బోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా .. వారు "నజరేయుడైన యేసు క్రీస్తు నామమున" నడువుమని చెప్పెను వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను,, ఆ కుంటివాడైన భిక్షగాడు నడిచినతరువాత ఏమిచేశాడో తెలుసా ? 1.దేవుడు తనకు చేసిన మేలును బట్టి .. "నడుచుచు గంతులు వేసెను " 2.దేవుడు తనకు చేసిన మేలును బట్టి... "దేవుని స్తుతించెను " 3..దేవుడు తనకు చేసిన మేలును బట్టి..." దేవాలయములోనికి వెళ్లెను" 4.దేవుడు తనకు చేసిన మేలును బట్టి..." ప్రజలముందు దేవుని ఘనపరచెను" 👉అయితే మనసంగతి ఏంటి ? 👉ఎన్నో మేలులు నజరేయుడైన ఏసు నామమున పొందాము కానీ 🔺ఎవరికైనా నీకు కలిగిన మేలులు గూర్చి చెప్పవ ?, 🔺సంతోషముతో గంతులు వేసావా ?, 🔺నిరంతరం అయన సన్నిధిలో ఉంటున్నావా ? 👉 ఆలోచించు ముఖ్యముగా మనం తెలుసుకోవాలిసింద...

PRAISE THE LORD

                                                ✳PRAISE THE LORD✳                                 బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యెహోవా వారికి ఆశ్రయమై యున్నాడు. సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక.యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును.            కీర్తనలు  14:6,7 సీయోనులోనుండి ఇశ్రాయేలునకురక్షణకలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇశ్రాయేలు సంతోషించును.                  కీర్తనలు 53:6 👉బాధించబడుతున్నావా? ▪బాధపడకు. భయపడకు. 👉 ఎందుకంటే? ఆయన.... ▪ నీ పక్షముగా నున్నాడు. ▪నీతో వున్నాడు. ▪ నీకు ఆశ్రయమై వున్నాడు. 👉ఆయనే మన ఆశ్రయమైతే? "సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ...

ప్రతి ఒక్కరు తప్పకుండా చదవండి

                              మాటలతోనా, క్రియలతోనా?         మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున అందరికి వందనములు. ఈ రోజులలో కొంతమంది క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నామని, క్రీస్తును ప్రేమిస్తున్నామని చెప్తూ అద్బుతముగా డిజైన్లతో దేవుని లేఖనములను Wallpapers (ఫోటోలు) గా డిజైన్ చేసి Whatspp, Facebook లో పెడుతున్నారు.  మరి కొంతమంది స్టేటస్ లో “Jesus I love You” అని “Jesus is My Life” అని “Bible is My Teacher” అని ఇలా రక రకాలుగా స్టేటస్ లు పెడుతుంటారు. ఏదైతేనేమి యేసు క్రీస్తు మీద, బైబిలు మీద తమకు ఉన్న ఫీలింగ్స్ ను  వ్రాత పూర్వకముగా, మాటల ద్వారా, ప్రసంగాల ద్వారా అద్భుతముగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు, సంతోషం అలా చెయ్యడం మంచిదే, తప్పేమీ కాదు.  కాని వారిలో చాలా మందికి “క్రీస్తు మీద ఉన్న ప్రేమ మాటల వరకు పరిమితమైనది కాని క్రియల్లో మాత్రం కనపడుటలేదు.” బహుశా యేసు క్రీస్తు మీ జీవితాలలో చేసిన అద్భుత కార్యాలను బట్టి, రక్షణ (సిలువ త్యాగం) కార్యాన్ని బట్టి అయన మీద ఎంతో ప్రేమ ఉండొచ్చు, కాని ఆ ...

చదివిన అద్భుతమైన మెసేజ్

                                                 చదివిన అద్భుతమైన మెసేజ్  🌳 చాలా కాలం క్రితం ఓ పెద్ద పండ్ల చెట్టు ఉండేది. ఓ చిన్న పిల్లవాడు చాలా ఇష్టంగా, ప్రేమగా దాని చుట్టూ ఆడుకునేవాడు. 🌴 ఓ రోజు చెట్టు పైకి ఎక్కాడు,పండ్లు కోసుకొని తిన్నాడు, ఆ చెట్టు నీడలో కాసేపు పడుకున్నాడు. ఆ అబ్బాయి ఆ చెట్టును ఎంతగానో ప్రేమించాడు, ఆ చెట్టు కూడా ఆ అబ్బాయి తన వద్ద ఆడుకోవడాన్ని చాలా ఇష్టపడింది, అతన్ని అమితంగా ప్రేమించింది. 🏝 కాలం గడిచింది, చిన్న పిల్లవాడు పెరిగి పెద్ద వాడైయ్యాడు. ఇప్పుడు ఎక్కువగా ఆ చెట్టు నీడలో ఆడుకోవడం లేదు 🌿 కొంత కాలం తర్వాత ఓ రోజు ఆ బాలుడు చెట్టు వద్దకు వెళ్లాడు,ఎందుకో విచారంగా ఉన్నాడు. "రా వచ్చి నా వద్ద ఆడుకో"  అని చెట్టు అడిగింది. 👦 బాలుడు:- "నేనింకా చిన్న పిల్లాడిని కాను, చెట్ల చుట్టూ తిరుగుతూ ఆడుకునే వయసు కాదు నాది, నాకిప్పుడు ఆడుకోడానికి బొమ్మలు కావాలి, అవి కొనడానికి డబ్బులు కావాలి " అన్నాడు. 🌳 చెట్టు :- "నా దగ్గర డబ్బులు అయిత...

'బలహీనుడను అనుకుంటున్నావా?'

                                          'బలహీనుడను అనుకుంటున్నావా?' 🌱ఒక ప్రసంగీకుని మాటలు వింటున్నప్పుడు, నేనట్లా ప్రసంగించలేక పోతున్నానే? 🌱ఒక సింగర్ పాడుచున్నప్పుడు, నేనట్లా పాడలేక పోతున్నానే? 🌱ఒక మ్యుజిషియన్ వాయిస్తున్నప్పుడు, నాకట్లాంటి నైపుణ్యములేవి లేవే? ... అంటూ వాళ్ళనీ వీళ్ళనీ పోల్చుకొని కృంగిపోయేవారు కొందరైతే? వాళ్ళనీ వీళ్ళని పోల్చుకొని వారికున్న  తలాంతులను చూచి పొంగిపోయేవారు మరి కొందరు. 🌱ఎవ్వరితోనూ నీవు పోల్చుకోనవసరం లేదు. ఎందుకంటే? నీలాంటి వారు ఈలోకంలో ఎవ్వరూలేరు. 🌱ఒక తల్లికి పుట్టిన కవలలో కూడా చెప్పలేనన్ని వ్యత్యాసాలు. నీకు నీవే ప్రత్యేకం. 🌱నిన్ను ప్రత్యేకంగా దేవుడు సృష్టించాడు. నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగియున్నాడు. 🌱అట్లాంటప్పుడు? నేను చేతకానివాడిని, చేతకానిదానను అంటూ ఎందుకు కృంగిపోతున్నావ్? 🍃ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింప కుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు. బలవంతులైనవారిని సిగ్...

A-B-C-D In Word Of GOD

                       A-B-C-D In Word Of GOD  దేవుని వాక్యాలతో కూడిన అందమైన ఆంగ్ల అక్షరమాల.. షేర్ చేయండి.. సాధన చేయండి... దేవుని వాక్యాన్ని వెంబడించండి.. 〰〰〰〰 A B C (రెండవ తిమోతి 3:1-17) Avoid Bad Company.. చెడు సహవాసమును విడిచిపెట్టు.. 〰〰〰〰 D E F (సామెతలు 14:17) Don't Entertain in Foolish things.. వ్యర్ధమైన వాటియందు ఆనందపడకు.. 〰〰〰〰 G H I (ఫిలిప్పి 4:8) Go for Higher Ideas.. ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళు.. 〰〰〰〰 J K L M (యోహాను 3:16) Just Keep LORD In Life.  జీవితంలో దేవునిని కలిగియుండు.. 〰〰〰〰 N O P (సామెతలు 19:17) Never Overlook the Poor in suffering.. బాధలోనూ పేదవారిని అశ్రద్ధ చేయకు 〰〰〰〰 Q R S (Proverbs 20:19) Quit Reacting to Silly gossips.. అనవసర విషయాలపై స్పందించకు.. 〰〰〰〰 T U V (Proverbs 11:14) Tune Urself for the Victory.. విజయం కోసం నిన్ను నువ్వే మార్చుకో.. 〰〰〰〰 W X Y Z (John 4 : 10) We Xpect You'll Zoom in ur life. మేము ఆశీస్తున్నాము నువ్వు జీవితంలో ఎదుగుతావని

ఆదరించు వాక్యము

                                                  ఆదరించు వాక్యము నా ప్రియ స్నేహితులారా.... లోకం మనలను ఆదరించలేదు.... ఈ లోకంలో దేనివల్లకూడా మనకి ఆదరణ లభించదు. అందుకే పరలోకం నుండి మనకు ఒక ఆదరణకర్త కావలసివచ్చింది. ఆదరణలేమి అనేది నిరుత్సాహం నుండి పుడుతుంది.... నిరుత్సాహం ఓటమి నుండి ఏర్పడుతుంది. మనం ఏదో అనుకుంటాం, ఏదో చెయ్యాలని అనుకుంటాం, ఏదో అశిస్తాము.... అవి అన్ని జరగని పక్షమున ఈ నిరుత్సాహం పుడుతుంది.... దీనివల్ల మనలో ఉన్న ఆ కొద్ది ఆదరణ కూడా కోల్పోయే పరిస్థితులు వస్తుంటాయి. ఈ మాట గమనించండి.... ఓడిపోవటం తప్పు కానే కాదు అండి.... చాలా మంది పెద్దవాళ్ళు ఇదే చెబుతుంటారు.... పడిపోవటం తప్పు కాదు.... ఓడిపోవటం తప్పుకాదు. పడిపోయినా వెంటనే తిరిగిలేవలేకపోవటం తప్పు.... ఓటమిలోనుంచి గెలుపు కొరకు పాఠాలు నేర్చుకోకపోవటం తప్పు. అవును... ఓటమి మనకి నేర్పే గెలుపు పాఠాలు మనం నేర్చుకోవాలి.... ఓడిపోయినప్పుడు మరో అవకాశం వస్తే ఎలా గెలవాలి అనే విషయం మీదే మన దృష్టి నిలిచివుండాలి....

పౌలు జీవిత చరిత్ర

                                  పౌలు జీవిత చరిత్ర  •••••••••••••••• క్రీస్తు తర్వాత స్థానాన్ని పౌలు గారికి ఇవ్వొచ్చు ఎందుకంటే ఇతడు పరిశుద్దాత్మ ద్వారా పలికిన ఒక గొప్ప మాట  I కొరింథీయులకు 11 : 1 - "నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి"  మీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి ఈ మాటను మీరు చెప్పగలరా..?? చెప్పగలిగితే మీరు ధన్యులు  పౌలు:- కిలికియాలోని తార్సు పట్టణంలో జన్మించాడు క్రీ.శ 30  సం.ప్రభువైన  యేసు మరణం - ఆరోహణం - ఆదరణ కర్తయైన పరిశుద్దాత్మ భూలోకానికి పంపబడడం భూటకమని భావించాడు యవ్వనడైన పౌలు    తాను ఒక నిష్టగల పరిశుద్దుడు గాను, ఇస్రాయేలీయుడుగాను ధర్మశాస్త్రం(ఓల్డ testament) ప్రకారం అనింద్యుడిగాను జీవించి గమలియేలు పాదాల దగ్గర వేదాంత విద్యను అభ్యసించి క్రైస్తవ్యాన్ని రూపుమాపడం కోసం క్రైస్తవులను హింసిస్తున్నట్లుగా విశ్వసిన్చాడు "నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదములయొద్ద పెరిగి, మ...

రాజులకు రక్షణసువార్త

                                                     రాజులకు రక్షణసువార్త అగ్రిప్ప" అనే రాజు పౌలు తో "ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే"అని అనినట్లు మీతో కూడా ఎవరైనా అన్నారా ? *అయితే మన సమాధానం ఎలా ఉండాలో  పౌలు ద్వారా నేర్చుకుందాం మనము కూడా ఇతరులకు అనగా" దేవుని ఎరుగని" వారికీ ఆయనను తెలిపే ప్రయత్నం చేస్తూవుంటాం కానీ వారిలో కొందరు వింటారు, కొందరు నువ్వు ఎన్ని చెప్పిన నన్ను క్రైస్తవుడు గా మార్చలేవు "పుట్టుకతో వచ్చింది  కట్టెతో నే పోవాలి గాని "నేను మారాను అంటుంటారు కదూ అయినా మనం సువార్త మానకూడదు అయితే పౌలు "అగ్రిప్ప రాజు" తో అన్న మాటలు గమనించండి 1.  అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేనెరుగు దును (అపొ. కార్యములు 26:27) ఈ వాక్యాన్ని గమనించినట్లయితే పౌలు శిక్షార్హుడై ఆ రాజు యొద్దకు తీసుకు రాబడి యున్నాడు అక్కడ కూడా పౌలు రాజు కు సువార్త చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అర్ధం అవుతుంది 2. ప్రవక్...

ఎదురీదుట

                                         ఎదురీదుట  👉యువతీయువకులు అనేక రకాల ఒత్తిడులకు, ఆకర్షణలకు ఇదివరకెన్నడూ లేనంతగా గురియగుచున్నారు. 👉మంచి చెడులను విచక్షణా సహితంగా గుర్తించలేని పరిస్థితిలో అధిక సంఖ్యాకులు ఉన్నారు. దేవుని అల్ప సంఖ్యాకులతో చేరాలో, అపవాది యొక్క అధిక సంఖ్యాకులలోనికి దూకాలో తెలియక అయోమయంలో వున్న స్త్రీ పురుషుల కొరకు ఈ సందేశం వ్రాయబడినది. ➡ "నీవు యౌవనుడవుగా ఉన్నప్పుడు ఎక్కడ నిలుచుందువో అదియే నీవు పెద్దవాడవయ్యాక నీవు కూర్చునే స్థలాన్ని నిర్ణయిస్తుంది." 👉'శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబము' అను బలమైన కోటగోడ లోపల అపవాది యుగాల తరబడి ప్రజలను, విశేషముగా యౌవనులను బంధించి యుంచాడు (1 యోహాను 2:16). అపవాదిని సిలువ మీద ఓడించిన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచువారు వెంటనే సంపూర్తిగా విడుదల చేయబడుదురు. 👉అయితే అపవాది వారిని మరలా చేజిక్కించుకొనవలెనని వారి వెంటబడి తరుమును. వారు రాజీ పడునట్లు వాడు వారిని మభ్యపెట్టును. వారు మరలా వానికి బానిసలగునట్లు వారిని వారి తలంపులలోను,...

THE KING

                                                              THE KING ముద్రణ యంత్రం కనిపెట్టినపుడు ముద్రించిన మొదటి పుస్తకం బైబిలు.📕 రెండు గ్రహలు మీద చదివిన మొట్టమొదటి గ్రంధం బైబిలు.📕 ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే పుస్తకాలలో మొదటి స్థానంలో ఉన్న గ్రంధం బైబిలు.📕 ప్రపంచంలో  ఎక్కువ భాషలలోకి తర్జుమా చేసిన గ్రంధం బైబిలు.📕 బైబిలులో భూత,వర్త,భవిష్యత్ కలిగియున్న పరిశుద్దగ్రంధం. అందుకే బైబిలుకు మరో పేరు ఉంది. BIBLE IS A TIME MACHINE🕒🕓🕑🕜🕠🕕🕡🕙🕤🕣🕗🕤🕘 బైబిలు అందుబాటలో ఉన్నంతగా మరి ఏ పుస్తకము అందుబాటులో లేదు.📕 బైబిలులో  ఉన్నంతగా చెప్పబడిన చరిత్ర మరి ఏ గ్రంధంలో చెప్పలేదు.📕 మన భారత దేశానికి స్వాతంత్ర్యమును తీసుకుని వచ్చుటలో మహాత్మా  గాంధి కొండ మీద యేసు చేసిన ప్రసంగం నుంచి కొన్ని సూత్రాలు తీసుకుని వాడుకున్నారు.📕 బైబిలు వలె మరి ఏ పుస్తకము లోను అంత అధికమైన ఐక్యత భావం లేదు.📕 బైబిలు భక్తులు చేసి...

నీ సహవాసం ఎవరితో

                                నీ సహవాసం ఎవరితో 👉ఏ మనిషి కూడా పుట్టుకతోనే మంచివారిగానో, చెడ్డవారిగానో పుట్టరు. అది స్త్రీ కానీ పురుషుడుగాని అది ఎవరైనాసరే వారి పుట్టుక వారి మంచి చెడులను నిర్ణయించలేదు.... ఒక వ్యక్తిని సహజంగా మంచివడిగానో, చెడ్డవాడిగానో మార్చేది వారివారి కుటుంబ పరిస్థితులు, సమాజం, మరియు వారి సహవాసం. ఈ అంశాలే సాదారణంగా ఒక వ్యక్తి సాక్షాన్ని మారుస్తాయి. ఏటువంటి కుటుంబంలో జన్మించాలో మనం నిర్ణయించలేము. . . . అలాగే ఒక్కసారిగా ఈ సమాజాన్ని మనం మర్చెయనూలేము. . . . కానీ.... ఎవరితో సహవాసం చేయాలి ఎవరితో సహవాసం చేయకూడదో మనం నిర్ణయించగలము. పౌలుగారు కోరింధియులకు మొదటి పత్రిక వ్రాస్తూ " దుర్మార్గులతో, దుష్టులతో సాంగత్యం చేయకుడి" అని అంటారు.చెడ్డవారితో స్నేహం మంచి వారిని కూడా చెడ్డవారిగా మార్చేస్తుంది అంటారు పౌలుగారు. మరి మీరు గమనించండి. . . . ఒక అతను మార్కేట్ కి వెళ్లి ఒక ఐదు ఆపిల్ పండ్లు కొనితేచ్చాడు, ఇంటికి వచ్చి చూసుకున్నాడు ఆ ఐదు పండ్లులో ఒక పండు కుళ్ళిపోయింది, అయ్యో అని బాద్దపడ్డాడు తరువాత వ...

ప్రసంగ సూత్రాలు

                                                                                                                ప్రసంగ సూత్రాలు ప్రసంగము మనిషిని మార్చేదిగా ఉండాలి. ప్రసంగము చేయుటలో మన ఉద్దేశము ప్రజలలో మార్పును తెచ్చుటయే. మన ప్రసంగాలు ప్రభావవంతంగా ఉండుటకు ఉపయోగపడే కొన్ని విషయాలు చర్చిద్దాం. 1. ప్రార్ధన చేయాలి: ఈ సూత్రమును అన్నిటికంటే ముందు ఉంచుట చాలా ప్రాముఖ్యము. మనిషిలో పశ్చాత్తాపము కలుగజేసి, నూతన క్రియను చేయగలిగింది పరిశుద్ధాత్ముడే కనుక, ఆయనపై అనుకొని ప్రసంగించాలి. సిద్ధపాటుతో మొదలుకొని ప్రసంగము అనంతరము వరకు ప్రార్ధనలో ఆయనతో మనం నడవాలి. అసలు, మనం చేసేది అయన పని కనుక, అయన నడిపింపు లేనిదే పని జరుగదు. 2. ఆసక్తిని కలిగించాలి: మనం చేసిన ప్రసంగం ఒక వ్యక్తి జీవితంలో మార్పును తేవాలంటే, ముందు అతడు దానిని వినాలి...

ఉదయకాల ప్రార్ధన

                                                         ఉదయకాల ప్రార్ధన             ప్రేమ స్వరూపి పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన ఉన్నతమైన మహానత్తమైన నాముమునకు స్తుతులు స్తోత్రాలు.......  తండ్రి గడచిన కాలమంతయు మీ కృప రెక్కల నీడలోను మీ రక్తపు కోటలోను దాచి ఆయుష్షును ఆరోగ్యము సురక్షితాన్ని క్షేమాన్ని అనుగ్రహించి మరొక శ్రేష్ఠమైన దినములో అడుగుపెట్టుటకు మీరు మా యెడల కృపచూపినందులకై మీకు మా కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు అర్పించుకుంటున్నాము........ అయ్యా మాదేశ రాష్ట్రాలలో నెమ్మదిని శాంతి సమాధానమును అనుగ్రహించండి పరిపాలిస్తున్న వారికి విశేషమైన మీ కృపనిచ్చి బలపరచి అను నిత్యం దేశ వాసుల యెడల మేలు చేయవలెనను తృష్ణను వారిలో మీరు కలుగజేయండి మీ ప్రజలు మీ బిడ్డలు క్షేమముగా ఉండునట్లు మీ కార్యములను నూతనపరచండి పాడి పంటలను ఉద్యోగ వ్యాపారాలను చేతి వృత్తుల వారిని మీరు దివించండి దేశము సుభిక్షంగా ఉండునట్లు ...

మితిమీరితే

                                         మితిమీరితే ....  🍭మితిమీరిన  ఖర్చు  ...  పేదరికం పాలు చేస్తుంది. 🍭మితిమీరిన  పొదుపు  ..  కష్టాల పాలు చేస్తుంది. 🍭మితిమీరిన  సంపాదన  ...  మనశ్శాంతిని లేకుండా చేస్తుంది. 🍭మితిమీరిన  కర్తవ్యం  ...  అగచాట్ల పాలు చేస్తుంది. 🍭మితిమీరిన  క్రమ శిక్షణ  ...  రక్త సంబధీకులను దూరం చేస్తుంది. 🍭మితిమీరిన  బాధ్యతలు  ...  అప్పుల పాలు చేస్తుంది. 🍭మితిమీరిన  హాస్యం  ...  నవ్వుల పాలు చేస్తుంది. 🍭మితిమీరిన  కోపం  ...  శతృవులను వృద్ధి చేస్తుంది. 🍭మితిమీరిన  ఆలోచనలు  ...  జీవితాన్ని దుర్భరం చేస్తుంది. 🍭మితిమీరిన  వ్యసనాలు  ...  అప మృత్యు పాలు చేస్తుంది. 🍭మితిమీరిన  స్వార్ధం  ...  అందరినీ దూరం చేస్తుంది. 🍭మితిమీరిన  పోటీ  ...   నష్టాల పాలు చేస్తుం...

యేసు మాటలో శక్తి

                                                   యేసు మాటలో శక్తి  ⭐ ఆయన మాటలో ఎంత శక్తి ఉన్నదో చూద్దాం! 1.మాటతో నీరు ద్రాక్షారసముగా మారింది, యోహాను 2:1-11 2. మాటతో పేతురు తనవల పిగిలిపోయేటంత చేపలు పట్టగలిగాడు లూకా 5:4-10 3. మాటతో తుఫానును ఆపివేశారు మార్కు 4:37-41 4. అంజూరపుచెట్టు వాడి/ఎండిపోయెను మత్తయి 21:18-21 5. శతాధిపతియొక్క సేవకుడు బాగుపడ్డాడు మత్తయి 8:1-13 6. కనానుదేశపు స్త్రీ యొక్క కుమార్తె బాగుపడింది. మత్తయి 15:21-28 7. 38 సంవత్సరాలుగా వ్యాదిగల వ్యక్తి బాగయ్యాడు. 5:5-9 8. దయ్యాలు వదలిపోయాయి లూకా 4:33-36 9. గెరాసేనుల దేశంలో సేన దయ్యం పట్టినవాడు బాగుపడ్డాడు, దయ్యాలు వదలిపోయాయి. మార్కు 5:1-20 10. చనిపోయిన లాజరు మాటతో బ్రతికి సమాధినుండి లేచివచ్చాడు. యోహాను 11:1-44 11. చనిపోయిన విధవరాలి కుమారుడు బ్రతికాడు. లూకా 7:11-16 👉 చూశారా! ఎంత శక్తి ఉందో ఆయనమాటలో! నాయీను గ్రామమంతా వచ్చి ఆ విధవరాలితో “అమ్మా ఏడువకు!” అన్నారు. గాని ఆమ...

సహోదరుడు భక్త్ సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన

                          "అలసిన వానికి ఊరడించు మాటలు" “కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఆలాగు చేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్ర లోనిది త్రాగవలెను, ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగు వాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని   త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులును  రోగులునై యున్నారు”. (1 కొరింతి 11:28-30) మన ప్రభువైనయేసు క్రీస్తు యొక్క కోరిక ఏమనగా ఆయన సంఘము “కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను, నిర్దోష మైనదిగాను , మహిమ గల సంఘము గాను” ఆయన ఎదుట నిలువ  బెట్ట బడ వలెనను నదియే.  అది ఆయన కోరిక మాత్రమే కాదు. దానికొరకు ఆయన అన్ని ఏర్పాట్లు చేసెను.( యూదా 24;2 2 వ దెస్స 1:10: ;1 వ యోహాను 3:1-3; యోహాను 6: 36-57).  ఆయన కోరిన  రీతిగా మనము కళంకమైనను దోషమైనను లేకుండా దేవుడు కోరిన  పరిమాణమును మన యెదుట నుంచు కొనవలెను. ఆయనను పోలినవారముగా, ఆయన కుమారుని యొక్క సారూప్యమునకు  మార్చబడిన వారముగా మనముండవలెనని ఆయన కోరుచున్నాడు. మన మాయనకు విధేయత చూపిన యె...

విశ్వాసము

                        ✳ విశ్వాసము ✳ 📖 కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళపరచి మనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను. సంఖ్యా 13:30 వాగ్ధాన భూమిని స్వతంత్రించు కొనుటకుగాను, ఆ దేశ పరిస్థితులు తెలిసుకొనుటకుగాను, పండ్రెండు గోత్రములలో నుండి, పండ్రెండుగురిని మోషే కనానుకు పంపించాడు. వారిలో కాలేబు, యెహోషువా తప్ప మిగిలిన పది మంది తెచ్చిన సమాచారం ఏమిటంటే? •అది పాలు తేనెలు ప్రవహించు దేశమే •ఆ దేశములో నివసించు జనులు బలవంతులు; మనము వారితో యుద్ధం చెయ్యలేము. •వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి. •మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. •మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు. •మా దృష్ఠికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్ఠికిని అట్లే ఉంటిమనిరి. 👉అయితే, వారిలో కాలేబు, యెహోషువా తెచ్చిన సమాచారం ఏమిటంటే? •మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. •అది పాలు తేనెలు ప్రవహించుదేశము. •యెహోవా మనయందు ఆనం దించినయెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మన కిచ్చును •యెహో...

,క్రైస్తవులందరూ ఒకరితో ఒకరు ఎలా ఉండాలి?

              ,క్రైస్తవులందరూ ఒకరితో ఒకరు ఎలా ఉండాలి? 1) ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి          కొలస్సీయులకు 3:9 2) మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెను         యోహాను 13:34 3) మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి         యాకోబు 5:16 4) ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి          యాకోబు 5:16 5) ఒకనిమీదనొకడు సణగకుడి         యాకోబు 5:9 6) మరియు ఒకనితో నొకడు సమాధానముగా ఉండుడి.          1థెస్సలొనికయులకు 5:13 7) ఒకనినొకడు ఆదరించుకొనుడి.         1థెస్సలొనికయులకు 4:18 8) ఒకరినొకరు క్షమించుడి. .       ఎఫెసీయులకు 4:32 9) ఒకని' భారముల నొకడుభరించుడి         గలతియులకు 6:2 10)  ఒకనికొకడు తీర్పు తీర్చ కుడి.          రోమీయులకు 14:13 11)  ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.          రోమీయులకు 12:10 12)  ఒకని నొకడు వ...