విశ్వాసము
✳ విశ్వాసము ✳
📖 కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళపరచి మనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను.
సంఖ్యా 13:30
వాగ్ధాన భూమిని స్వతంత్రించు కొనుటకుగాను, ఆ దేశ పరిస్థితులు తెలిసుకొనుటకుగాను, పండ్రెండు గోత్రములలో నుండి, పండ్రెండుగురిని మోషే కనానుకు పంపించాడు.
వారిలో కాలేబు, యెహోషువా తప్ప మిగిలిన పది మంది తెచ్చిన సమాచారం ఏమిటంటే?
•అది పాలు తేనెలు ప్రవహించు దేశమే
•ఆ దేశములో నివసించు
జనులు బలవంతులు;
మనము వారితో యుద్ధం చెయ్యలేము.
•వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి.
•మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము.
•మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు.
•మా దృష్ఠికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్ఠికిని అట్లే ఉంటిమనిరి.
👉అయితే, వారిలో కాలేబు, యెహోషువా తెచ్చిన సమాచారం ఏమిటంటే?
•మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము.
•అది పాలు తేనెలు ప్రవహించుదేశము.
•యెహోవా మనయందు ఆనం దించినయెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మన కిచ్చును
•యెహోవా మనకు తోడైయున్నాడు. గనుక, వారికి భయపడవలసిన పనిలేదు.
•దాని జయించుటకు మన శక్తి చాలును.
➡ ఎందుకు? వారికి, వీరికి మధ్య ఇంత వ్యత్యాసము?
•వారు ఉన్నత దేహులను చూస్తున్నారు.
👉వీరు ఉన్నత దేవుని చూస్తున్నారు.
•వారు బలవంతులైన మనుష్యులను చూస్తున్నారు.
👉వీరు బలవంతుడైన దేవునిని చూస్తున్నారు.
•వారు సమస్యను చూస్తున్నారు.
👉వీరు సమస్యను పరిష్కరించగల దేవునిని చూస్తున్నారు.
•వారు ఆ దేశ ప్రాకారాలను చూస్తున్నారు.
👉వీరు దేవునినే ప్రాకారముగా కలిగియున్నారు.
•వారు మిడతలము ఆనుకొని వారిని వారు బలహీన పరచుకొంటున్నారు.
👉వీరు మిడతల దండుచే ఐగుప్తీయులను భయపెట్టిన దేవుని బలాన్నిచూచి, బలాన్ని పొందుకొంటున్నారు.
•అక్కడనున్న భయంకరమైన పరిస్థితులు తప్ప, వారికేమి కనిపించట్లేదు.
👉దేవుని వాగ్దానం తప్ప వీరికేమి కనిపించట్లేదు.
అందుకే, సుమారు 30లక్షల మంది ఐగుప్తు నుండి బయలుదేరితే? బయలు దేరిన వారిలో కేవలం వీరిద్దరు మాత్రమే వాగ్ధాన భూమికి చేరగాలిగారు.
👉విశ్వాసం ఎప్పుడూ పరిస్థితులను చూడదు. వాటిని పరిష్కరించగలిగే దేవునివైపు మాత్రమే చూస్తుంది.
మనమునూ శోధనలవైపు కాకుండా, శోధనలనుండి తప్పించే దేవునిపై విశ్వాసముంచి సాగిపోదాము.
📖 అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే యని అతనితో చెప్పెను.
మార్కు 9:23
ఎవడైనను ఈ కొండను చూచినీవు ఎత్తబడి సముద్ర ములో పడవేయబడు మని చెప్పి, తన మనస్సులో సందే హింపక తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
మార్కు 11:23
👉నమ్మడం మనకు సాధ్యమైతే? అసాధ్యమైనవి సహితం సుసాధ్యమౌతాయి.
👉కానీ, నమ్మడమే అత్యంత కష్టం.
కారణం?
మన చుట్టూనున్న పరిస్థితులు నమ్మడానికి ఏమాత్రమూ సహకరించవు.
అయితే,
విజయం సాధించే మార్గంలో మనమెక్కవలసిన
మొట్ట మొదటి మెట్టు,
👉దేవునిలో విశ్వాసముంచడమే.
అంటే?
ఆయనపైనే పూర్తిగా ఆధారపడడం.
👉నమ్మలేక పోతున్నామంటే?
• ఆయన శక్తిని చులకన చేస్తున్నట్లే.
• బలవంతుడైన దేవునిని బలహీన పరుస్తున్నట్లే.
• సృష్టి కర్తను విడచి, సృష్టికి భయపడినట్లే.
• భక్తి పరులం అని చెప్పుకొంటూ ఆయన శక్తిని ఆశ్రయించ లేకపోయినట్లే.
అబ్రాహాము ముందున్న పరిస్థితులను చూడండి.
• ఎక్కడకి వెళ్ళాలో తెలియదు. అయినా బయలుదేరాడు.
కారణం?
దేవుడే గమ్యం చేరుస్తాడు అనే విశ్వాసం.
• తన వాగ్ధాన పుత్రుడైన ఇస్సాకును బలి అర్పించమంటే? సిద్ధపడ్డాడు.
👉కారణం?
దేవుడు బలి తీసుకున్నా, తిరిగి బ్రతికించగలడు అనే విశ్వాసం.
అందుకే, విశ్వాసులకు తండ్రి అయ్యాడు.
నమ్మడం మనకు సాధ్యమైతే? అసాధ్యమైనవి సహితం సుసాధ్యమౌతాయి.
విశ్వసిద్దాం!
విజయం సాధిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!...✍-----------------------------------------------------మనమందరము దేవునికి స్తోత్రాలు చేద్దాము.

Comments
Post a Comment