రాజులకు రక్షణసువార్త

                                                     రాజులకు రక్షణసువార్త

అగ్రిప్ప" అనే రాజు పౌలు తో "ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే"అని అనినట్లు మీతో కూడా ఎవరైనా అన్నారా ? *అయితే మన సమాధానం ఎలా ఉండాలో  పౌలు ద్వారా నేర్చుకుందాం

మనము కూడా ఇతరులకు అనగా" దేవుని ఎరుగని" వారికీ ఆయనను తెలిపే ప్రయత్నం చేస్తూవుంటాం కానీ వారిలో కొందరు వింటారు, కొందరు నువ్వు ఎన్ని చెప్పిన నన్ను క్రైస్తవుడు గా మార్చలేవు "పుట్టుకతో వచ్చింది  కట్టెతో నే పోవాలి గాని "నేను మారాను అంటుంటారు కదూ

అయినా మనం సువార్త మానకూడదు

అయితే పౌలు "అగ్రిప్ప రాజు" తో అన్న మాటలు గమనించండి

1.  అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేనెరుగు దును
(అపొ. కార్యములు 26:27)

ఈ వాక్యాన్ని గమనించినట్లయితే పౌలు శిక్షార్హుడై ఆ రాజు యొద్దకు తీసుకు రాబడి యున్నాడు అక్కడ కూడా పౌలు రాజు కు సువార్త చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అర్ధం అవుతుంది

2. ప్రవక్తలును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియు చెప్పక అల్పు లకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని అని సమాధానమిచ్చెను 
(అపొ. కార్యములు 26:23)

ప్రవక్తలు మోషేయు చెప్పిన మాటలు అనగా దేవుని గూర్చి  ధైర్యముగా చెప్పినట్లు గమనించండి

అయితే పౌలు అగ్రిప్ప మధ్య సంబాషణ గమనించండి
1. అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే అని పౌలుతో చెప్పెను
(అపొ. కార్యములు 26:28)

2. అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో, తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలె ఉండునట్లు దేవుడనుగ్రహించుగాక అనెను
(అపొ. కార్యములు 26:29)

ఈ వాక్యాన్ని బట్టి పౌలు అగ్రిప్ప రాజు తో మిమ్ములనే మాత్రమే కాదు బందకాలలో ఉన్నవారి కొరకే ఈ సువార్త చేయుచున్నని చెప్పినట్లు గ్రహించాలి 

దీనిని బట్టి మీకేం అర్ధం అవుతుంది పౌలు సమయానుకూలం గ అందరికి అనగా వినిన వారికీ ,వినని వారికీ అందరికి సువార్త చేయుచు వచ్చెను పౌలుగారు అందరికి నిత్యా జీవమార్గం తెలపడానికి ఎంతో ప్రయాసపడినట్లు తెలుస్తుంది

 అయితే మనం ఏమి చేస్తున్నాం ఒక్కరికి అయినా సువార్త చేస్తున్నామా ? అగ్రిప్ప లాంటి తిరస్కరించే  వారికీ సైతం సువార్త చేయగలిగే ధైర్యం మనకుందా ఆలోచించండి...అలాగే పౌలు గారు సువార్తప్రకటించక పోతే నాకు శ్రమ అని అంటున్నాడు
ప్రియమైన దైవజనమా మన పరిస్థితి ఏంటి
ప్రభువు వార్త ప్రకటనలో పౌలు గారిలా ఉన్నవా? అట్టి బాద్యతను కల్గి అనేకులను ప్రభువు యొద్దకు చేర్చే సువార్తను చెప్పగలుగుతున్నావా? లేక నాలుగు గోడల మధ్య ఉండి ఇదే నాకు పరలోకము అని నిర్లక్ష్యము చేస్తున్నావా ఆలోచించు
దానియేలు 12:3 నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములవలె నిరంతరమును ప్రకాశించెదరు కావున దేవుని ప్రియజనమా అపో.పౌలు బంధకములలో ఉండి కూడ "రాజులకు రక్షణసువార్తని" అనగా ప్రభువు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు ..........,అలాగే నీవు నేను అనేకులకు యేసయ్య రక్షణ సువార్తను ప్రకటిద్దాము,ప్రయాసపడుదాము ఆయనకొరకు కొన్నైన ఆత్మలను సంపాదిద్దమా?

అట్టి కృప ధన్యత,ధైర్యమును యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు దయచేయును గాక !!
ఆమెన్  ఆమెన్   ఆమెన్

Comments

Popular posts from this blog

పౌలు జీవిత చరిత్ర

ఉదయకాల ప్రార్ధన

ప్రసంగ సూత్రాలు