నీ సహవాసం ఎవరితో
నీ సహవాసం ఎవరితో
👉ఏ మనిషి కూడా పుట్టుకతోనే మంచివారిగానో, చెడ్డవారిగానో పుట్టరు. అది స్త్రీ కానీ పురుషుడుగాని అది ఎవరైనాసరే వారి పుట్టుక వారి మంచి చెడులను నిర్ణయించలేదు.... ఒక వ్యక్తిని సహజంగా మంచివడిగానో, చెడ్డవాడిగానో మార్చేది వారివారి కుటుంబ పరిస్థితులు, సమాజం, మరియు వారి సహవాసం. ఈ అంశాలే సాదారణంగా ఒక వ్యక్తి సాక్షాన్ని మారుస్తాయి.
ఏటువంటి కుటుంబంలో జన్మించాలో మనం నిర్ణయించలేము. . . .
అలాగే ఒక్కసారిగా ఈ సమాజాన్ని మనం మర్చెయనూలేము. . . .
కానీ.... ఎవరితో సహవాసం చేయాలి ఎవరితో సహవాసం చేయకూడదో మనం నిర్ణయించగలము.
పౌలుగారు కోరింధియులకు మొదటి పత్రిక వ్రాస్తూ " దుర్మార్గులతో, దుష్టులతో సాంగత్యం చేయకుడి" అని అంటారు.చెడ్డవారితో స్నేహం మంచి వారిని కూడా చెడ్డవారిగా మార్చేస్తుంది అంటారు పౌలుగారు.
మరి మీరు గమనించండి. . . .
ఒక అతను మార్కేట్ కి వెళ్లి ఒక ఐదు ఆపిల్ పండ్లు కొనితేచ్చాడు, ఇంటికి వచ్చి చూసుకున్నాడు ఆ ఐదు పండ్లులో ఒక పండు కుళ్ళిపోయింది, అయ్యో అని బాద్దపడ్డాడు తరువాత వాటిని ఒక పాత్రలో జాగ్రత్తగా దాచిపెట్టాడు
ఒక రోజు తరువాత అతను వచ్చిచుస్తే ఆశ్చర్యంగా ఆ ఐదు పండ్లు కూడా కుళ్ళిపోయికనిపించాయి. ఏం జరిగింది....?
ఆ కుళ్ళిపోయిన ఒక్క పండులోని క్రిమి మిగిలిన అన్ని పండ్లను నాశనంచేసింది.
ఏంత జాగ్రతగా దాచినా కూడా ఆ వ్యక్తి మోసపోయాడు .... ముందు పూర్తిగా మంచి పండ్లను ఎన్నిక చేసుకునే విషయంలో మోసపోయాడు. మళ్ళి ఆ కుళ్ళిన పండును మిగిలిన మంచి పండ్ల నుండి వేరుచేసే విషయంలోనూ మోసపోయాడు. . . .
దేవుని వాక్యం ఈ విషయాన్నే చెబుతుంది. . . .
" పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును." ( గలతీయులకు 5:9 ) ( I కొరింథీయులకు 5:6 )
అవును. . . . పులిసిన పిండిని తీసుకుపపోయి మంచి పిండిముద్దలో కలిపితే ఆ పిండి ముద్ద అంతయు పులిసిపోతుంది.
ఈ "పులిసిన పిండి" అనగా .... వేషదారులు, నామకార్ధ క్రేస్తవులు, ఏమాత్రం ఆత్మీయత లేని వారు మరియు వారి సహవాసము.
నా ప్రియ స్నేహితులారా.... ఈ విషయం నేను చెప్పటం లేదు....
యేసయ్య చెప్పారు. (లూకా 12:1) (మత్తయి 16:6) (మార్కు8:15)
వేషదారణ అనే పులిసిన పిండి.... నామకార్ధ క్రేస్తవత్వం అనే పులిసిన పిండి....
ఆత్మీయతలేమి అనే పులిసిన పిండి.... తప్పుడు బోధ అనే పులిసిన పిండి....
ఇలాంటి ఈ పులిసిన పిండిని తీసుకొచ్చి నీదగ్గర ఉన్న మంచి పిండి ముద్దలో కలిపితే, నీ జీవితంలో కలిపితే.నీ దగ్గరవున్న మంచి పిండిముద్ద కూడా పులిసిపోతుంది, నీ ఆత్మీయత కూడా చెడిపోతుంది.
" మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి; దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు." ( I కొరింథీయులకు 15:33,34 )
అవును. . . .మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.
* ఒకే గూటిలో పుట్టిన రెండు చిలుకలు ఉన్నాయి, అనుకోకుండా ఒక రోజు ఈ రెండు చిలుకలు ఒక వేటగాడికి దొరికిపోయాయి, ఆ వేటగాడు ఆ రెండిటిలో ఒక చిలుకను తన ఇంటికి తీసుకెళ్ళాడు మరొక చిలుకను ఒక దేవుని సేవకుడికి అమ్మేశాడు. . . . ఒక చిలుక వేటగాని ఇంటిలో, మరొక చిలుక దేవుని సేవకుని ఇంటిలో పెరుగుతూ వచ్చాయి. అలా అవి మాటలు కూడా నేర్చుకున్నాయి. కొంత కాలానికి అవి ఆ ఆ పరిస్తితులకి అలవాటు పడ్డాయి.
ఒక రోజు ఒక బాటసారి అలసిపోయి ఈ వేటగాడి ఇంటికి వచ్చి ఆ ఇంటి బయట విశ్రమించాడు అంతే ఆ వేటగాడి ఇంటిలో పెరిగిన చిలుక ఆ బాటసారిని చూసి " ఒరేయ్.... ఇక్కడికి ఎందుకోచ్చావు, పో.... వెంటనే వెళ్ళాకపోయావో నీ మెడ కొరికి నిన్ను చంపేస్తాను" అని మాట్లాడింది. ఆ బాటసారికి భయం వేసింది వెంటనే అక్కడినుండి పరుగు పరుగున వెళ్ళిపోయాడు. అతను అలా భయపడటం చూసి ఆ చిలుక నవ్వుకుంది.
ఆ బాటసారి కష్టపడుతూనే మరో ఇంటికి చేరాడు అది దేవజనుడి ఇల్లు. నెమ్మదిగా ఇంటిలోకి చూసాడు వామ్మో.... అక్కడ మరో చిలుక ఉంది ఈ చిలుక కూడా తనని తిడుతుంది అనుకోని ముందే ఆ ఇంటి నుండి పారిపోదం అనుకున్నాడు. అంతలో ఆ చిలుక " ఓ బాటసారి.... నీకు స్వాగతం, నీ ప్రయాణం వల్ల బాగా అలసిపోయి వుంటావు కొంచంసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకో.... ఆకలిగా ఉంటే అక్కడ కొన్ని పండ్లు ఉన్నాయి తిను." అని అన్నది. ఈ బాటసారికి ఆశ్చర్యం వేసింది.
నా ప్రియ స్నేహితులారా.... ఒకే గూటిలో పుట్టాయి, కానీ వేరు వేరు వెక్తుల సహవాసంలో పెరిగాయి అంతే వాటిలో ఏంత తేడానో చూసారుగా. మంచి సహవాసం మంచి నడతను నేర్పుతుంది. చెడ్డ సహవాసం చెడ్డ నడతను నేర్పుతుంది.
అందుకే పౌలుగారు తన ఆత్మీయ సంఘానికి ఇలా చెబుతున్నారు. . . .
"....సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని, లోభిగాని, విగ్రహారాధకుడుగాని, తిట్టుబోతుగాని, త్రాగుబోతుగాని, దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను. ( I కొరింథీయులకు 5:11 )
* అలాంటి వారిని పూర్తిగా ద్వేషించమని కాదు, ప్రేమించండి, ప్రతివారి గురించి ప్రార్దించండి, కాని వారు మీమీద ప్రభావం చూపునంతగా వారికి అవకాశం మీరు ఇవ్వకండి. . . .
గమనించండి. . . .
Globalisation, Civilzation, Modernization పేరుతో World Culture కొత్తకొత్త పోకడలు పోతోంది. Social Networks, Fake Relatioships, Careless Attitude. . . . ఇది నేటితరం.
మరి ఇంతటి గందరగోళంలో కూడా మంచి వ్యక్తుల సహవాసాన్ని మాత్రమై కలిగి ఉండేవాడే నిజమైన క్రేస్తవుడు.
దానియేలుకు మంచి స్నేహితుల సహవాసం ఉంది కనుకే అన్యదేశంలో కూడా అద్భుతాలు చేయగలిగారు.అన్యదేశంలో కూడా దేవుని నామాన్ని మహిమపరచారు.
హల్లెలూయ. . . .

Comments
Post a Comment