ప్రార్థన
✳.......ప్రార్థన .......✳
✳ తగ్గింపుమనసుతో చేసే ప్రార్ధన...✍
"సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచుదేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను."
లూకా 18:13
▪సమాజంలో నీచమైనస్థితి.
▪అంటరాని వాడు.
▪వెలివేయబడిన జీవితం.
👉నేను దేవాలయంలో అడుగు పెట్టడానికి అర్హుడను కాను.
👉 ఆయనను ప్రార్ధించే అర్హత నాకు లేదు. అని అనుకొని వుంటే?
🔺ఈరోజు మనము ఆ సుంకరిని గురించి మాట్లాడుకోవలసిన అవసరంలేదు.
👉ప్రార్ధించాలి అనే తలంపు మనకువస్తే చాలు.
🔺మెల్లగా సాతాను మనలోనికి ప్రవేశించి,
🔺నీవు ఆ తప్పు చేసావ్, ఈ తప్పు చేసావ్ అంటూ... నీవు ప్రార్ధించినా, దేవుడు వింటాడా? నీ టైం వేస్ట్ తప్ప అంటాడు. వాడు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది మనకు.
🔺సరేలే! మనల్ని మనము సరిచేసుకున్నాక ప్రార్ధన చేద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చేస్తాం.
👉 ఇక వాడు గ్రేండ్ సక్సస్ అంటూ గంతులువేస్తాడు.
👉ప్రార్ధన మానేసాము అంటే? దేవునితో మాట్లాడడం మానేసినట్లే.
👉దేవునికి దూరమై దయ్యముతో సహవాసం ప్రారంభమయినట్లే. సాతానుకు దగ్గరయ్యినట్లే.
🔺మనము ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి.
🔹ఎంత ఘోర పాపి అయినా పశ్చాత్తాపముతో ఆయన దగ్గరకు వస్తే?
🔹ఎంత మాత్రమూ ఆయన త్రోసివేయడు.
👉సుంకరి దేవాలయములో చేరి ఒక చిన్న ప్రార్ధన చేసాడు.
"దేవా, పాపినైన నన్ను కరుణించు"
👉పశ్చాత్తాప హృదయంతో సుంకరి చేసిన చిన్న ప్రార్ధన నేరుగా దేవునికి చేరింది.
🔺 తనను తాను హెచ్చించుకొనిన పరిసయ్యునికంటే, ఇతనిని నీతిమంతునిగా తీర్చింది.
🔺పరిసయ్యుడు దేవుని ప్రార్ధించుటలేదు. తానెంతటి గొప్పవాడనో దేవునికి చెప్పుకొంటున్నాడు.
🔹సుంకరి ప్రార్ధనలో భయం, రోధన, పశ్చాత్తాపం, తగ్గింపు ఇవన్ని మిళితమై వున్నాయి.
🔹 ఇవే అతనిని నీతిమంతుల జాబితాలో చేర్చాయి.
👉నేను తప్పు చేస్తున్నాను ఇక నా ప్రార్ధన దేవుడు వినడు అని ఒక నిర్ణయానికి వచ్చేసి, ప్రార్ధించడం మానేసి, దేవునికి దూరమైపోయావేమో?
👉సుంకరివలే ప్రార్ధిద్దాం.
🔺 మనము అతిశయించడానికంటూ ఏమిలేదు.
🔺ఒకవేళ ఏదయినా వుంది అంటే?
▪అది ఆయన దయవలనే.
🔺 మనలను మనము తగ్గించుకొంటూ,
🔺మనకోసం తన ప్రాణం పెట్టిన ప్రియరక్షకుని సన్నిధిలో తగ్గింపు మనసుతో మోకరిల్లుదాం!
👉సుంకరివలే నీతి మంతులముగా తీర్చబడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

Comments
Post a Comment