PRAISE THE LORD

                                               ✳PRAISE THE LORD✳
                               

బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యెహోవా వారికి ఆశ్రయమై యున్నాడు.
సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక.యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును.
           కీర్తనలు  14:6,7

సీయోనులోనుండి ఇశ్రాయేలునకురక్షణకలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇశ్రాయేలు సంతోషించును.
                 కీర్తనలు 53:6

👉బాధించబడుతున్నావా?
▪బాధపడకు. భయపడకు.

👉 ఎందుకంటే?
ఆయన....
▪ నీ పక్షముగా నున్నాడు.
▪నీతో వున్నాడు.
▪ నీకు ఆశ్రయమై వున్నాడు.

👉ఆయనే మన ఆశ్రయమైతే?
"సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు
కొదువయై యుండదు."
            కీర్తనలు 34:10

👉అడవికి రాజయిన సింహపు పిల్లలు ఆకలిగొనే ప్రసక్తే లేదు.  ఒకవేళ అవయినా ఆకలిగొన వచ్చేమో గాని,
ఆయనను ఆశ్రయించే మనకు ఏ మేలు తక్కువకాదు.

👉ఎందుకంటే?
మనము రారాజు పిల్లలం.
యువరాజులం.

👉సాతాను చెరలోనుండి ఆయన  మనలను విడిపించాడు.
▪రాజులుగా
▪యాజకులుగా
▪ఆయన పిల్లలుగా
▪ఆయన స్నేహితులుగా
మనలను చేసి, విమోచించి ధన్యకరమైన జీవితాన్నిచ్చాడు.

👉ఇంత చేసినా?
ఆయన ప్రేమను, త్యాగమును
వివేచించ కుండా,
ఇంకా చెడు మార్గాల్లోనే నడుస్తూ ,
దేవుడే లేడు అని చెప్పే బుద్దిహీనమైన జీవితాన్ని జీవిస్తూవుంటే?

👉నీ జీవిత గమ్యమేమిటో తెలుసా?
▪ భయం
▪సిగ్గు
▪ అవమానం
▪ దేవుని ఉగ్రత

వద్దు!
సరిచేసుకుందాం!
సాగిపోదాం!
ఆ పరమ సీయోనుకు చేరుదాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్!

Comments

Popular posts from this blog

పౌలు జీవిత చరిత్ర

ఉదయకాల ప్రార్ధన

ప్రసంగ సూత్రాలు