ఎదురీదుట

                                         ఎదురీదుట 

👉యువతీయువకులు అనేక రకాల ఒత్తిడులకు, ఆకర్షణలకు ఇదివరకెన్నడూ లేనంతగా గురియగుచున్నారు.
👉మంచి చెడులను విచక్షణా సహితంగా గుర్తించలేని పరిస్థితిలో అధిక సంఖ్యాకులు ఉన్నారు. దేవుని అల్ప సంఖ్యాకులతో చేరాలో, అపవాది యొక్క అధిక సంఖ్యాకులలోనికి దూకాలో తెలియక అయోమయంలో వున్న స్త్రీ పురుషుల కొరకు ఈ సందేశం వ్రాయబడినది.

➡ "నీవు యౌవనుడవుగా ఉన్నప్పుడు ఎక్కడ నిలుచుందువో అదియే నీవు పెద్దవాడవయ్యాక నీవు కూర్చునే స్థలాన్ని నిర్ణయిస్తుంది."

👉'శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబము' అను బలమైన కోటగోడ లోపల అపవాది యుగాల తరబడి ప్రజలను, విశేషముగా యౌవనులను బంధించి యుంచాడు

(1 యోహాను 2:16). అపవాదిని సిలువ మీద ఓడించిన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచువారు వెంటనే సంపూర్తిగా విడుదల చేయబడుదురు.

👉అయితే అపవాది వారిని మరలా చేజిక్కించుకొనవలెనని వారి వెంటబడి తరుమును. వారు రాజీ పడునట్లు వాడు వారిని మభ్యపెట్టును.

వారు మరలా వానికి బానిసలగునట్లు వారిని వారి తలంపులలోను, మాటలలోను మరియు వారి క్రియలలోను దారి మళ్ళించుటకు వాని చేతనైనదంతా చేయును. 
👉ప్రవాహమునకు వ్యతిరేకముగా ఎదురీదుటకు మీరు సాహిసించాల్సింది ఇక్కడే.
👉 ప్రవాహమునకు వ్యతిరేకముగా ఎదురీదుటకు జంకువారు అపవాది వలలో చిక్కుకొనుట నిశ్చయము.
👉 కెరటాలకు వ్యతిరేకముగా ఎదురీదుట వాస్తవముగా కష్టమే కాని శక్తికి వ్యతిరేకముగా శక్తిని ఉపయోగించినప్పుడు చేకూరు సత్తువ ఎక్కువవుతుంది.
➡కెరటాలకు వ్యతిరేకముగా ఎదురీదిన వారి కథలు బైబిలులో కోకొల్లలుగా ఉన్నాయి-

1⃣ దేవుని హెచ్చరికను పరిహసించినవారికి వ్యతిరేకముగా నోవహు ఎదురీదాడు. 

2⃣రహస్యముగా పాపము చేయుటయే తెలివిగలతనము అను ధోరణికి వ్యతిరేకముగా యోసేపు ఎదురీదాడు. 

3⃣ దేవుని నడిపింపు కంటె సమృద్ధియైన సంపద మరియు పలుకుబడి ప్రాముఖ్యమైనవను ఆలోచనకు వ్యతిరేకముగా మోషే ఎదురీదాడు. 

4⃣ విశ్వాసము కాదు గాని ఇంద్రియ గ్రాహ్యముతో కూడిన తెలివే విజయము అను భావమునకు వ్యతిరేకముగా కాలేబు ఎదురీదాడు.

5⃣ పాపిష్టియైన సుఖానుభూతులకు వ్యతిరేకముగా రూతు ఎదురీదినది.

6⃣ లంచగొండితనము మరియు అవినీతికి వ్యతిరేకముగా నెహెమ్యా ఎదురీదాడు. 

7⃣ దావీదు పగతీర్చుకొను మనస్సుకు వ్యతిరేకముగా ఎదురీదాడు. 

8⃣ యౌవనులైన - హనన్యా, అజర్యా మరియు మిషాయేలు- విగ్రహమును ఆరాధించు మనస్తత్వమునకు వ్యతిరేకముగా ఎదురీదారు. 

➡ నీవు కూడా భిన్నముగా ఉండుటకు భయపడకు.
➡ పాపిష్టిదైన ఈ లోకంలో పరిశుద్ధముగా జీవించండి. చక్కగా చదువుకొనండి. కష్టపడి పని చేయండి. పాఠ్యపుస్తక తెలివితో పాటు మంచి మర్యాదలు కూడా నేర్చుకొనండి. 

➡దేవునితో మాట్లాడండి. ఆయన చెప్పేది వినండి. మంచి నాయకులను మాదిరిగా చేసుకోండి.

👉 క్రైస్తవ జీవితమంటే, ఆరంభము నుండి అంతము వరకు కూడ ప్రవాహమునకు వ్యతిరేకముగా ఎదురీదుటయే. ఆవలి గట్టుచేరు వరకు వెళ్లుట అంత సులభం కాదు, అది అసాధ్యమూ కాదు.

( I యోహాను 2:16-17 )
" లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. " ఆమేన్‌.

హల్లెలూయ. . . .

Comments

Popular posts from this blog

పౌలు జీవిత చరిత్ర

ఉదయకాల ప్రార్ధన

ప్రసంగ సూత్రాలు