Posts

గలతీయులకు

Image
Galatians(గలతీయులకు) 4:6,7,8,9,11,12 6.మరియు మీరు కుమారులై యున్నందుననాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. 7.కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. 8.ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులై యుంటిరి గాని 9.యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల? 11.మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. 12.సహోదరులారా, నేను మీవంటివాడనైతిని గనుక మీరును నావంటివారు కావలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. 

వ్యక్తిత్వ వికాస సూత్రాలు

                    వ్యక్తిత్వ వికాస సూత్రాలు 🌺నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది. చీకటితో పోరాడితేనే గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారుతుంది. మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది. జీవితంతో పోరాడితేనే మానవత్వం ఉన్న మనిషిలా మసరుతాము... 🌺ఐసులా కరిగిపోయే ఐశ్వర్కం కన్నా, మాటలా నిలిచిపోయే మంచితనమే గొప్పది. 🌺 కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే....... 🌺 మంచి ఎక్కడ వున్నా పరిగ్రహించు. చెడు ఎక్కడ ఉన్నా పరిత్యజించు. 🌺 నిన్ను చూసి చప్పట్లు కొట్టే పది వేళ్ళ కన్నా కన్నీరుతుడిచే ఒక్క వేలు మిన్న.... 🌺 మేలు చేయక పోయిన పరవాలేదు. ఎవరికి కీడు మాత్రం చేయకూడదు. 🌺 నిజమైన స్నేహితుల్ని సంపాదించుకోవడం అన్నిటికంటే కష్టతరం. 🌺 సంతృప్తిగలవాడు మట్టిని ముట్టినా బంగారమవుతుంది. 🌺 పుస్తకాలు, స్నేహితులు కొద్దిగా ఉన్నా మేలైనవిగా ఉండాలి. 🌺 ప్రపంచంలో నువ్వొక సాధారణ మనిషివే కావచ్చు. కానీ కనీసం ఒక్కరికైనా నువ్వు ప్రపంచమంత గొప్పగా కనిపించేలా జీవించు. 🌺 మనం పక్షుల్లా గాలిలో ఎగరడం, చేపల్లా నీటిలో ఈదడం నేర్చుకున్నాము. కానీ...

రాకడ ముంగుర్తులు

రాకడ ముంగుర్తులు 1.నేనే క్రీస్తు ననువారు వత్తురు (మత్తయి 24 : 5) 2.అబద్ద ప్రవక్తలు వత్తురు (మత్తయి 24 : 11) 3.యుద్ధములు (మత్తయి 24 : 6) 4.కరువులు (మత్తయి 24 : 8) 5.గొప్ప విపత్తులు (లూకా 21 : 10-11) 6.ఉద్యోగములు దొరకవు (జకర్యా 8 : 10) 7.నోవాహు దినమువలె నుండును (మత్తయి 24 : 37-39) 8.తిండి దొరకదు (విలాప వాక్యములు 4 : 5) 9.ఇల్లు కట్టుట, నారు నాటుట ,అమ్ముట (లూకా 17 : 28-30) 10 ధనము విస్తరించుట (యాకోబు 5: 1-10) 11.అక్రమమువృద్ధి (మత్తయి 24: 10) 12.ధైర్యము చెడికూలుదురు (లూకా 21 : 25,26) 13.ఒకనినొకడు అప్పగించును (మత్తయి 24 : 10) 14.వాక్య కరువు (ఆమోసు 3 : 11) 15.తల్లిదండ్రుల వలన, సోదరుల వలన (లూకా 21 : 10-17) 16.మనుష్యుల శవములు రాలుట (యిర్మియా 9 : 22) 17.కల్పననా కథలకు తిరుగు కాలము (2 తిమోతి 4: 3-4) 18.నామకభక్తి (2 తిమోతి 3 : 5) 19.వీధి రథములు (బస్సులు) (నహోము 2 : 4) 20.ప్రవచన అర్ధము చెప్పువారు లేతురు (దానియేలు 12 : 4) 21.యూదుల రాకవలన ఆందోళన (యెహెజ్కే 38 : 16) 22.పరిశుద్ధాత్మ బాప్తిస్మము క్రీస్తు రాకడలో అందరూ పాలుపొందవలెను (అ.కా. 1 : 4-5) 23.అతుకనికాలము (మన కాలము) (దానియేల...

ప్రార్థన

                        ✳.......ప్రార్థన .......✳ ✳ తగ్గింపుమనసుతో చేసే ప్రార్ధన...✍ "సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచుదేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను." లూకా 18:13 ▪సమాజంలో నీచమైనస్థితి. ▪అంటరాని వాడు. ▪వెలివేయబడిన జీవితం. 👉నేను దేవాలయంలో అడుగు పెట్టడానికి అర్హుడను కాను. 👉 ఆయనను ప్రార్ధించే అర్హత నాకు లేదు. అని అనుకొని వుంటే? 🔺ఈరోజు మనము ఆ సుంకరిని గురించి మాట్లాడుకోవలసిన అవసరంలేదు. 👉ప్రార్ధించాలి అనే తలంపు మనకువస్తే చాలు. 🔺మెల్లగా సాతాను మనలోనికి ప్రవేశించి, 🔺నీవు ఆ తప్పు చేసావ్, ఈ తప్పు చేసావ్ అంటూ... నీవు ప్రార్ధించినా, దేవుడు వింటాడా? నీ టైం వేస్ట్ తప్ప అంటాడు. వాడు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది మనకు. 🔺సరేలే! మనల్ని మనము సరిచేసుకున్నాక ప్రార్ధన చేద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. 👉 ఇక వాడు గ్రేండ్ సక్సస్ అంటూ గంతులువేస్తాడు. 👉ప్రార్ధన మానేసాము అంటే? దేవునితో మాట్లాడడం మానేసినట్లే. 👉దేవునికి దూరమై దయ్యముతో సహవాసం ప్రారంభమయిన...

ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు

ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు                     దేవుని ఆశీర్వాదములు భౌతికమైనవి వున్నవి (ద్వితి 28)ఆత్మసంబంధమైనవి వున్నవి. కొత్తనిబంధన లో యేసుప్రభువు చెప్పి నట్లుగా భౌతిక దీవెనులు చెడ్డవారికి మంచివారికి అందరికి సమానముగానే అనుగ్రహింప బడును (మత్తయి5:45)ఆరోగ్యము,ఐశ్వర్యము,అధికారము,జ్ఞానము,బలము భౌతికమైనరీతిలో అందరికి నరుల కష్ఠముతో కాకుండా భూమి మీద కృప జూపు దేవుని వలననే లభించు చున్నవి.(యిర్శియా9:24,సామెతలు10:22)        అయితే ఆత్మీయ ఆశీర్వాదములు క్రీస్తు నందు ఉన్నవారికి మాత్రమే లభించుచున్నవి. భౌతిక ఆశీర్వాదములు ఈలోకములో మన జీవితకాలమునకు తాత్కాలికంగా ఇవ్వబడితే, ఆత్మీయదీవెనలు శాశ్వతముగా ఇవ్వబడుచున్నవి.దురాశ ను అనుసరించుట వలన లోకములోని భ్రష్ఠత్వమును ఈ వాగ్ధానముల మూలముగాతప్పించుకొని దేవుని స్వభావములో పాలివారు అగునట్లుగా వాటిని అనుగ్రహించెను.(2పేతురు1:4)        దేవునిచేత ఏర్పరచబడుట ఒక ఆశీర్వాదమే ,పాపక్షమాపణ,తనచిత్తమును గూర్చిన మర్మము మనకు ముందే తెలవడం ఆశీర్వాదములే పరలలోకములో ఉన్నవి భూమిమీద వున్నవి  స...

అంత్యదినాలలో మానవుల పరిస్థితి

 అంత్యదినాలలో మానవుల పరిస్థితి  👉 నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని బైబిల్ చెపుతుంది. 🔺 ఎవరైతే ఆసంగతి గ్రహించి, సువార్తను నమ్మి యేసునందు విశ్వాసము ఉంచుతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. పరిశుద్దులౌతారు. 👉 ఈనాడు మనుష్యులు మోసం చేయడంలోను అబద్దాలు చెప్పడంలోను పోటి పడుతున్నారు. 👉 ఎవరు ఎంత తెలివిగా మోసంచేస్తే అంత గొప్పగా ఫీలవుతున్నారు. 👉 కాలం మారిందని అందరు అనుకొంటున్నారు కాని మారింది కాలం కాదు మానవులు. 👉 చాలా విపరీతంగా మానసికంగాను భౌతికంగాను వారిని వారే చెరిపేసుకుంటున్నారు. 🔺 సత్యం తెలిసిన కూడా కళ్లకు కట్టినట్లుగా కనబడుతున్నా కూడా చాలా బాగా అర్ధమైనా కూడా దానికి కొంచం అయినా విధేయత (రెస్పాన్స్) చూపలేని తరం ఇప్పుడు వచ్చింది. “ఈ ప్రజలు కన్నులార చూచి చెవులారా విని మనస్సార గ్రహించి నా వైపు తిరిగి నావలన స్వస్థత పొందుకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసికొని యున్నారు అని పరిశుద్ధాత్మ యెషయాప్రవక్తద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే.” (అ.కా 28:27). 🔺 దేవుని వాక్యంలోని సత్యం తెలియపరచ బడినప్పుడు మనిషిలో పరిశుద్దాత్మ ఉంటే ఆ సత్యాన్న...
                        ఆలోచించు ఆలోచించు ఆదికాండము నుంచి ప్రకటన గ్రంధము వరకు 1. దేవుడు తన వద్దకు వచ్చిన వారిని తోసివేయడం చూచితివా? 2. దేవుడు ఎవరికైనా ఇచ్చిన సలహా వారికి సహాయము చేయకుండా తప్పిపోయిందా? 3. దేవుని నమ్మిన ఎవరైనా నాశనము అవటం చూచితివా? 4. దేవుడు సైతం తప్పించలేని ఏమి చేయలేని పరిస్థితులు చూచితివా? 5. దేవుని చిత్తమునకు లోబడి సంపూర్ణముగా నష్టపోయిన వారిని చూచితివా? 6. దేవుని నమ్ముకొని ఆశీర్వదింప బడని వారిని చూచితివా? 7. దేవుని నమ్ముకొని శాంతి లేకుండా జీవించిన వారిని చూచితివా? 8. దేవుడు మాట ఇచ్చి తప్పిపోవటం చేయకుండా ఉండటం చూచితివా? 9. దేవుడిని నమ్ముకొనిన వారు తమ శత్రువుల చేతికి విడువబడటం చూచితివా? 10. దేవుడు ఎవరినైనా కష్టములలో విడచి ముఖము త్రిప్పుకొనుట చూచితివా? 11. దేవుడు తనంతట తానే చేయి విడుచుట చూచితివా? 12. దేవుని నమ్ముకొన్న వారికి ఏ మేలు అయినా కొదువగా ఉండటం చూచితివా? 13. దేవుడు ఎవరికీ అయినా అన్యాయము చేయటం చూచితివా? 14. దేవుడు నీతి తప్పి ప్రవర్తించటం చూచితివా? 15. దేవుడు తన సంతోషం కోసం ఎవరిని అయినా హింస...