ఏడింతలు ఎక్కువగా దిగుబడి సాధిస్తున్న దేశం ఇజ్రాయెల్.

                        మీకు తెలుసా? ఇజ్రాయెల్ సైన్యంలో ముస్లిం సైనికులు కూడా వున్నారు. రోజంతా రంజాన్ సందర్బంగా వాళ్ళు ఉపవాసముంటే సాయంత్రం ఉపవాస దీక్ష విడిచే సమయానికి వారికోసం ఇజ్రాయెల్ ప్రభుత్వమే ఏర్పాటు చేసే విందు ఇది!!!
ఇజ్రాయెల్ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశం!! ఇరాన్,ఇరాక్,సౌదీ,దుబాయ్,మస్కట్,బహరేన్,కువైట్, ఖతార్,జోర్దాన్,ఈజిప్ట్,సిరియా,లెబనాన్,లిబియా వంటి 13  ఎడారి దేశాల మధ్య వున్న అతి చిన్నది, కానీ అత్యంత శక్తివంతమైనది,శాంతివంతమైనది ఇజ్రాయెల్ దేశం.చుట్టూ  వున్న 13 దేశాల జనాభా పది కోట్లకు పైగానే ఉంటుంది కానీ ఇజ్రాయెల్ జనాభా  80 లక్షలు మాత్రమే. అయినా, ఇజ్రాయెల్ అంటే వారికి మాత్రమే కాదు, ప్రపంచమంతటికీ హడల్!! అత్యంత ప్రాముఖ్యమైన విషయమేమిటో తెలుసా? ఆ 13 దేశాల్లో 10 దేశాలకు పెట్రోల్,డీసెల్ వంటి చమురు నిల్వలు పుష్కలంగా వున్నాయి, వారి సంపదకు కారణం చమురు. కానీ ఆ దేశాల నడుమనే వున్నా, ఇజ్రాయెల్ లో ఒక్క చుక్క కూడా చమురులేదు. అయినా చమురున్న ఈ పది ముస్లిం దేశాల ర్యాంకు అంతర్జాతీయ అభివృద్ధి సూచీ( IDI)లో ఖతార్ తో మొదలై 30  ఆ తర్వాతే ఉంటే, ఇజ్రాయెల్ ర్యాంకు మాత్రం 18. దేవుడు వారికి మరో 30 ఏళ్లలో పూర్తిగా అంతరించిపోయే చమురునిల్వలివ్వలేదు. ఎన్నటికీ అంతరించిపోని ప్రతిభా పాటవాలనిచ్చాడు, ధైర్య సాహసాలనిచ్చాడు. కంప్యూటర్లు,ఇంటర్నెట్ తో సహా ప్రపంచంలో నేటి అభివృద్ధికి  కారణమైన పరికరాలన్నింటినీ దాదాపుగా యూదులే కనుగొన్నారు.అంటే మొత్తం 750 కోట్ల మంది ప్రపంచ ప్రజల  జీవితాన్ని సుఖమయం,అభివృద్ధిదాయకం చేసిన వారు ప్రపంచ జనాభా లో వెయ్యవ వంతు కూడా లేని 80 లక్షల మంది యూదులే  అన్నమాట. యూదులు తమ దేశమైన ఇజ్రాయెల్ ను అత్యంత పటిష్టమైన దేశంగా, దుర్బేధ్యమైన కోటగా మార్చుకున్నారు. ఇజ్రాయెల్ కు  1948 లో అంటే మన తర్వాత ఒక ఏడాదికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ ఈ 70 ఏళ్లలో చాలా బలమైన, అవినీతిరహితమైన ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు నిర్మించుకున్నారు. ఒక పేదవాడు ఫిర్యాదు చేసినా SI ర్యాంకు పోలీసు అధికారి నేరుగా దేశ ప్రధానిని కూడా ఇంటరాగేట్ చేసే అధికారాన్ని వారి రాజ్యాంగం ఇచ్చింది. అందుకే క్రైమ్ రేట్ లో ఆ దేశం అట్టడుగున ఉంటుంది. బంధుప్రీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఇద్దరు ప్రధాన మంత్రులు జైలు శిక్ష పొందారు. వారిలో ఒకరికి శిక్ష విధించినప్పుడు  ఇజ్రాయెల్ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తిగా ఒక ముస్లిం వున్నాడు!!! ప్రజాస్వామ్యమంటే అదీ!!
ప్రపంచంలోని ముస్లిందేశాలన్నింటికీ ఇజ్రాయేలును ప్రపంచ పటం నుండి రూపు మాపాలన్నదొక్కటే  ధ్యేయం! కానీ ఇంతవరకైతే అది సాధ్యం కాలేదు కానీ ముస్లిం దేశాలే ఒక దేశం పైకి  మరొకటి దాడులు చేసుకొని తన్నుకొంటున్నాయి. పాకిస్థాన్ లో ఐసిస్ వరుస దాడులకు పాల్పడుతోంది. ట్యునీషియా, లిబియా,సిరియా, దక్షిణ యెమెన్, లెబనాన్ వంటి పేద ముస్లిం దేశాలు అంతర్యుద్ధాల్లో చిక్కి, శాంతి కరువై, ఆకలి చావుల కోరల్లో వున్నాయి. పక్కనే వున్న ఇజ్రాయెల్ మాత్రం పటిష్టంగా, శాంతికరంగా వుంది. వారి దేశంలో మూడింట రెండవ వంతు సేద్యానికి వీలుకాని ఎడారి ప్రాంతం. పైగా నీళ్లు కూడా అంతగా లేవు. అయినా వున్న కొద్దీ నీటితోనే కొద్దీ భూమిలోనే తమ తెలివి తేటలతో అత్యధికంగా పంట దిగుబడి వచ్చే పద్ధతుల్లో వ్యవసాయం చేసి స్వయం సమృద్హిని పొందడమే కాక పాలు,కూరగాయలు,పళ్ళు యూరోప్ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది.ఇండియాలో కన్నా ఎకరానికి ఏడింతలు ఎక్కువగా దిగుబడి సాధిస్తున్న దేశం ఇజ్రాయెల్.

Comments

Popular posts from this blog

పౌలు జీవిత చరిత్ర

ఉదయకాల ప్రార్ధన

ప్రసంగ సూత్రాలు