బైబిల్ తర్జుమాలు నేటి సంఘాల వివరణ

                        "బైబిల్ తర్జుమాలు నేటి సంఘాల వివరణ"
బైబిల్ ని తప్పుబట్టే వారికి సమాదానం.👇👇👇
ఈ ప్రపంచంలో ఎన్ని రకాల బైబిల్ తర్జుమాలు ఉన్న అందులోని భావం మాత్రం ఒక్కటే ఉంటుంది.
ఉదాహారణకి:భారత ప్రధానమంత్రి హైదరాబాద్ రాక ఈ వార్తను ఇప్పటి పలు రకాల న్యూస్ పేపర్స్ వారు పలు రకాల హెడ్డింగ్స్ పెట్టి కథనాలు రాస్తారు.
👉ఎవరు ఎన్ని కథనాలు రాసిన భారత ప్రధానమంత్రిగారు వచ్చింది నిజం ఆయన నోటితో ఏం మాట్లాడడో అది నిజం అది మాత్రమే నిజం...ఇక ఎన్ని రకాల కథనాలు రాసిన అది పూర్తిగా కల్పితం.
🔴ఇప్పుడు విషయానికి వద్దాం:అసలు బైబిల్స్ ఎన్ని రకాలు??
ప్రోటాస్టెంట్ బైబిల్ 66 పుస్తకాలు
రోమన్ కాథలిక్ 73 పుస్తకాలు
క్రిసమాటిక్ బైబిల్ 76 పుస్తకాలు
ఆర్థోడెక్స్ 86 పుస్తకాలు
👆ఎన్ని పుస్తకాలు ఉన్న ఎన్ని సిద్ధాంతాలు ఉన్న దైవం ఇచ్చిన సందేశం ఒక్కటే...యేసు క్రీస్తు బోధించిన బోధలు నిజం ఆయన ఈ లోకానికి రావడం సత్యం..ఎవరు ఎన్ని కల్పించి బైబిల్ పై మరియు దేవునిపై నిందలు పెట్టిన నిప్పుకు చెదలు పట్టదు..సూర్యన్ని అరచేతితో అప లేరు.
👉ఇక మా విశ్వాసం :బైబిల్ నిజం,బైబిల్ లోని దైవం నిజం అదే మేము నమ్ముతున్నాం....మీరు ఇలా అడగవచ్చు ఒకే దేవుడు గదా ఇన్ని రకాల గ్రంధాలు సిద్ధాంతాలు,ఇన్ని రకాల చర్చిలు ఎందుకు అని?మా జవాబు:ఒక ఊరిలో మీకు 10 గుడులు 10 మంది వేరువేరు దేవుళ్ళు ఉండొచ్చు ఆ పదిమంది దేవుళ్లను మీరు నమ్మవచ్చు,పూజించ వచ్చు అది మీ విశ్వాసం మీ నమ్మకం...అదే గ్రామంలో 10 చర్చిలు ఉన్న మేము ఒక్క దేవున్నే పూజిస్తాం ఆయనే యేసు క్రీస్తు,ఒకే గ్రంధం బోధిస్తాం అదే బైబిల్.
👉మాకు ఎన్ని రకాల పుస్తకాలు ఉన్న ,సిద్ధాంతాలు ఉన్న మా విశ్వాసం ఒక్కటే అదే ఏక దైవo ఎన్ని రకాల బోధలు ఉన్న బోధించేది ఒక్కడినే ఆయనే యేసు క్రీస్తు.

"క్రేస్త్యవం ఆగిపోయెది కాదు ఈ యుగ సమాప్తి వరకు సాగిపోయేది".
💡క్రేస్త్యవ్యాన్ని ఆపాలని చూచిన వారు 60,70 సంవత్సరాల వారి జీవిత కాలం ముగిసిన తరువాత కనుమరుగు అయ్యారు కాల చక్రంలో కలిసి పోయారు.
👉క్రేస్త్యవం నిరంతరం మండే దివిటి లాంటిది రెండు వేల సంవత్సరాల నుండి ఈ దీవీటి మండుటకు నూనెను ఎవరు సప్లై చేస్తున్నారో తెలుసా ?యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినవారు ఆయన కోసం హత సాక్షులుగా మృతి పొందినవారు..వారు చిందిన రక్తంనుండే నేటికి క్రేస్త్యవం మండుచు ప్రకాశిస్తుంది..దీనిని భూసంబంధమైన ఆలోచనలతో ఆర్పాలని చూసి అరిపోయిన మత పిచ్చి అమాయకులు ఎందరో...ఎందరెందరో..
👉క్రేస్తవులు మాటలయందు నేర్పు లేనివారు కావచ్చు కానీ జ్ఞానం నందు నేర్పులేనివారు కాదు.

"Read the Bible to Change your Life"

Comments

  1. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు (ప్రసంగి గ్రంగ్రంథమ7:24)
    ఏది సత్యం ఏది అసత్యం..?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పౌలు జీవిత చరిత్ర

ఉదయకాల ప్రార్ధన

ప్రసంగ సూత్రాలు