చెవి

 చెవి 👂 (వినుట)

వాక్యము : రోమా 10:17

1.కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.

👉యేసు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు వాడు బండమీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు, చేయని వాడు పునాదిలేని నేలమీద కట్టిన బుద్ధిహీనుని పొలినవాడు అని (మత్తయి7: 24-27) చెప్తున్నాడు. మరి నువ్వు బుద్ధిమంతుడివా? బుద్ధిహీనుడివా?
👉 విని రక్షింపబడిన/ శిక్షింపబడిన వారు:-

1. ఆదాము తన భార్య మాట విని శాపము తెచ్చుకొనేను.
(ఆది 3:7)

2. అబ్రహాము దేవుని మాట విని ఆశీర్వదించబడెను.
(ఆది 26:5)

3. దేవుడు రాహేలు మనవి విని ఆమె గర్భము తెరిచెను.
(ఆది 30:22)

4. ఐగుప్తులోని ఇశ్రాయేలీయుల మూలుగులు విని తన నిబంధన జ్ఞాపకం చేసుకొనేను.
( నిర్గమ 2:24)

5. దేవుడు యెహోషువా ప్రార్ధన విని, సూర్యుడు ఒకరోజు అస్తమింపకుండా చేసాడు.
(యెహోషువా 10:14)

6. పై అధికారుల మాట వినాలి.
(హెబ్రి 13:17)

7. కల్పనకథలు కాక సత్యము వినాలి.
(2తిమోతి 4:4)

8. సువార్త విని ఆత్మచేత ముద్రింపబడాలి.
(ఎఫెసి 1:13)
వాక్యము విని, దానిని గైకొనువారు యేసు సహోదారుల కన్నా ధన్యులు అని (లూకా 11:28) లో వ్రాయబడి ఉంది. నా మాట విని, నన్ను పంపినవాని యందు విస్వాసము ఉంచువాడు నిత్యజీవము గలవాడు (యెహాను 5:24). నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన యెడల నేనతనికీ తీర్పు తీర్చును ( యెహాను 12:47) .
🔥 మంచి నేలమీద పడిన విత్తనములా వాక్యము విని ఫలించాలి
(లూకా 8:15)
➡ ఐథియోపియుడైన నపుంసకుడు దేవుని వాక్యము విని, విశ్వసించి బాప్తిస్మము పొందుకున్నాడు.
(అపో. 8:35)
➡ యూస్తు ఇంటివారితో పాటు, కొరింథిలో అనేకులు విని, విశ్వసించి బాప్తిస్మము పొందిరి.
(అపో. 18:8)
➡ నినెవె వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి. (మత్తయి 12:41)
మరి నీ పరిస్థితి ఏంటి సోదరుడా/సోదరి???
ఇకనైనా దేవుని వాక్యము విని, విశ్వసించి మారుమనస్సు పొందుకొని నిత్యజీవము పొందుకుంటావో, వినకుండా శిక్ష పొందుకుంటావో నీవే ఆలోచించుకో...
🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷                        
[8:53 PM, 7/6/2017] +91 85209 24038: ఓనేసీము ఏవరో తెలుసా🤔??

ఫిలేమోను కు వ్రాసిన పత్రిక లో 8-10 వచనాలలో ఇ పేరు కనపడుతుంది బైబిల్ లో ఇతని చరిత్ర ఏమి కనపడదు 
సరే ఇ ఓనేసిము ఎవరో తేలియాలంటే ......!!!!!

కొలస్సి ప్రాంతంలో ఫిలేమోను అనే ధనవంతుడు,ఆత్మీయుడు,మరియు ప్రభువు పట్ల మంచి విస్వాసి ఉండేవాడు ఇతని క్రింద పని చేసే వాడే ఇ (ఒనేసీము)
ఇతను తన యజమాని ఇంట్లో దొంగతనం 💰💵 చేసి రోమా కి పారి పోతాడు అక్కడ రోమా పోలీసులు అతన్ని బందించి జైలుకి తీస్కెల్తారు 

అక్కడా ఒక జైలు గదిలో ఒక ముసలాయనా ( అయన ఎవరో కాదు అపోస్తుడైన పౌలు) ప్రార్దన చేస్తు ఉంటాడు 
అపుడు ఒనేసేముకు తెలియకుండానే మోకాళ్ళమీద పడి ప్రార్దిస్తుంటాడు 

అప్పుడు ఆ పెద్దాయన ఇతనిని చేయి పట్టి లేపి నీవు ఎవరు బాబు ? అని అడిగాడు 
నేను కోలస్సి ప్రాంతానికి చెందిన వాడ్ని దొంగతనం చేసి ఇక్కడ పట్టుబడ్డాను అని చేప్పాడు అప్పుడు పౌలు అవునా ఆ ప్రాంతంలో నాకు మంచి స్నేహితుడు ఫిలేమోను ఉన్నాడు అతను నీకేమైన తెలుసా ?? అని అడిగాడు 
అప్పుడు ఒనేసిము బయపడి పశ్చతాపంతొ కన్నీటితో ......

అయ్యా నేను దొంగతనం చేసిందే అ మంచివ్యక్తి ఇంట్లోఅని ఎడవఢం మోదలు పెట్టాడు అప్పుడు పౌలు తనని ఓదార్చి తనకి వాక్యాన్ని బోదించి తనని మంచి వ్యక్తిగా మారుస్తాడు 

కోన్నిరోజుల తర్వాత ఒనేసీము విడుదలయే రోజు దగ్గర పడుతుండడంతో పౌలు తనని పిలచి బాబు నాకో సాయం చేస్తావా ??? 
అని అడిగిన వెంటనె చిత్తం ప్రబు సెలవీయండి అని చెప్పిన వెంటనే పౌలు 

నేను నా స్నేహితుడైన ఫిలేమోనుకు ఒక ఉత్తరం వ్రాసాను నీవు తీస్కేల్లి ఇవ్వు అని చేప్పాడు 
తప్పకుండా ఇస్తాను అని అ ఉత్తరాన్ని తీసుకొని రాత్రింబగళ్ళు నడిచ తనకి తీస్కోని ఇచ్చాడు 

అలా తీస్కోచ్చి ఇచ్చిన పత్రికనే ఇప్పుడు మనం ఫిలేమోను పత్రికగా చదువుతున్నాం 

గమనించండి ప్రియులారా ఒక దొంగని దేవుడు సువార్తకి వాడుకోగా లేనిది మనల్ని ఎందుకు వాడుకోడు 

ప్రార్దించు దేవుడు నిన్ను సువార్తకు వాడుకుంటాడు పనికి రాని పాత్రని పనికొచ్చే పాత్రగా చేసే ఎకైక దేవుడు నా యేసయ్య 

మహిమ ఘనత క్రీస్తుకే కలుగును గాక

Comments

Popular posts from this blog

పౌలు జీవిత చరిత్ర

ఉదయకాల ప్రార్ధన

ప్రసంగ సూత్రాలు