ఉదయకాల ప్రార్ధన

     ఉదయకాల ప్రార్ధన 


            ప్రేమ స్వరూపి పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమై శ్రేష్ఠమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు....

అయ్యా గడచిన కాలామంతయు మీ కృపకౌగిటిలో దాచి జూన్ మాసం అంత కాపాడి మరొక మాసంలో సజీవ లెక్కల్లో ఉంచి వెళ్తున్న మార్గాలలో తోడుగా ఉండి సురక్షితాన్ని క్షేమాన్ని సర్వ సమృద్ధిని అనుగ్రహించి నానాటికి మీలో ఫలించి వృద్ధిపొందునట్లు చేసి మరొక జయజీవితన్నీ ప్రసాదించి ఈ జులై మొదటి పున్నారుత్థ ఆరాధనలో అడుగు పెట్టుటకు  మాకు కృపనిచ్చినందుకు మీకు వేలాది కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము......

అయ్యా ఈరోజు జరగబోతున్న సకల కోటి పరిశుద్ధుల ఆరాధనను మీరు అదియు అధ్యక్షత వహించి ఆశీర్వధకారముగా నడిపించండి మనిష్యుల శక్తి చేతను బలము చేతను కాకా మీ ఆత్మ వలన నడిపించమని సమస్తమును క్రమముగాను మర్యాదగాను మీరు ఉండి నడిపించండి మీ బిడ్డలను సకాలమునకే మీ సన్నిధికి నడిపించండి అడ్డు ఆటంకలన్నిటిని తొలగించండి మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని సరాలము చేసి నడిపించండి ఆత్మతోను సత్యముతోను మిమ్మలి ఆరదించుటకు పూర్ణ బలముతోను పూర్ణ హృదయముతోను నింప్పి బలపరచి నిలబెట్టుకోనండి......

మీ పక్షాన నిలబడబోతున్న మీ దాసులను మీ ఆత్మ చేత నింప్పి బలపరచి నవనూతనమైన వాక్కుల చేతను పరలోకపు ప్రకటనల చేతను నింప్పి బలమైన సాధనాలుగా వాడుకోనండి.....

అయ్యా మీరు మాతో వాగ్దానము చేసారు 
వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును అని తెలియజేశారు ఈ మసామంతయు మీ బిడ్డలకు తోడుగా ఉండి వారి కన్నీటి ప్రతి భాష్పాబిందువులను తుడచండి వారి కన్నిటికి కారణమైన పరిస్థితుల నుండి విడిపించండి వ్యాధి బాధ రోగ రుగ్మతల నుండి అశాంతి అసమాధానముల నుండి పాపబరితమైన శాప దోషాల నుండి పరిపూర్ణమైన విడుదలను ప్రాప్తి౦పజేయమని వేడుకుంటున్నాము కృప సమృద్ధిచేత నింపండి మీ పరిశుద్ధమైన బాహువును మీ బిడ్డలకు వారి సర్వస్వనికి తోడుగా నుంచమని ప్రార్థిస్తున్నాము మీ బిడ్డల జీవిన సంబంధమైన ప్రతి పనిలో దీవించి ఆశీర్వదించండి నూరంతల ఫలభివృద్ధిని కలుగజేయండి ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు నూతనమైన గృహాల కొరకు ఎదురుచూస్తున్న వారి ఆశను ఆశయాలను నెరేవేర్చండి మీ ప్రియ బిడ్డలు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించుటకు అర్హత లేని వారికి అర్హతను కలుగజేసే కృపను సమృద్ధిగా అనుగ్రహించండి నానాటికి ఆయుష్షును ఆరోగ్యన్ని సురక్షితాన్ని క్షేమాన్ని అనుగ్రహించి విస్తరింపజేయండి జయజీవితాన్ని ప్రాప్తిపజేయండి పరిశుద్ధాత్ముడి సన్నిధి సానిత్యాన్ని అనుక్షణం తోడుగా ఉంచి నడిపించమని......

సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటు....

సర్వ ఘనత మహిమ మానా ప్రభవాలు మీరు మాత్రమే పొందుకొనమని......

నజారేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి....

ఆమెన్! ఆమెన్! ఆమెన్! ఆమెన్

Comments

Popular posts from this blog

పౌలు జీవిత చరిత్ర

ఉదయకాల ప్రార్ధన

ప్రసంగ సూత్రాలు