✳... యేసు క్రీస్తు దాసుడు....✳

✳... యేసు క్రీస్తు దాసుడు....✳

నా ప్రియ స్నేహితులారా....

రోమా 1వ అధ్యాయము 1వ వచనము.
👉పౌలుగారు తాను ఇంతవరకు అడుగుపెట్టని ఒక సంఘానికి తననుతాను పరిచయం చేసుకుంటున్నారు.
పౌలుగారు అంటారు...

✳”నేను యేసు క్రీస్తు దాసుడను” ✳

👉యేసు అంటే రక్షకుడు అని అర్ధం....
👉క్రీస్తు అంటే అభిషేక్తుడు అని అర్ధం....
👉మరి దాసుడు అంటే. . . .?
గ్రీక్ లో దాసుడు అనే మాటకి “Doulos (δοῦλος)” అని ఉంటుంది. Doulos అంటే దాసుడు అని తెలుగులో చక్కగా ఉంది 
👉కానీ దాని మొదటి అర్ధం “భానిస - Slave” అని.... 
👉పౌలు తనను పరిచయం చేసుకుంటున్నారు...”నేను క్రీస్తుయేసుకి భానిసను” అని.

నా ప్రియ స్నేహితులారా... నలుగురు చదువుకున్న వారు ఒక చోట కూర్చుంటే వారికీ తెలిసిన అత్యుత్తమైన భాషతో వీలైనంత విషయ జ్ఞానంతో మాట్లాడుకుంటారు. ఉదాహరణకు తెలుగు వచ్చిన ఇంగ్లీష్ లో మాట్లాడుతూ పరిచయం చేసుకోవటంలాంటివి. 

మంచి పదములతో తనను మరొకరికి పరిచయం చేసుకోవటం మనిషికి బాగా అలవాటు. 

గమనించండి....

👉పౌలు విద్యావిహీనుడు కానేకాదు,
▪ అటు యూదా, ఇటు గ్రీకుకు సంబంధించిన అన్ని ప్రచీన భాషలలో కూడా బహు నేర్పరి. గమనించండి పౌలు విద్యగలవారు మాత్తమే కాదు అధిక విద్యగలవారు.
పౌలుకి ఎక్కడ ఏమి మాట్లాడాలో బాగా తెలుసు.... సున్నితమైన మాటలతో భావగర్భితముగా, గుండెను తాకే విధముగా ఉంటుంది పౌలుగారి భాషా శైలి. 
▪అంటే ఈ పత్రికను వ్రాస్తున్న పౌలు నాగరికత తెలిసిన వారె.... 
▪అలాగే ఈ పత్రిక అందుకుంటున్న రోమా వారు కూడా అత్యుత్తమైన నాగరికత తెలిసిన వారు; 
👉కానీ నేను బానిసను అని చాలా చులకనైనా మాటతో తననుతాను పరిచయం చేసుకుతున్నారు పౌలు.
🔺 బానిస అనే మాటకి అర్ధం రోమీయులకు బాగా తెలుసు; వారి దృష్టిలో ఆ మాట చాలా చులకనైనది.

🔺ఆ విషయం తెలిసి కూడా, ఇంకా చక్కగా తననుతాను పరిచయం చేసుకోగలిగి కూడా పౌలు నేను బానిసను అని పరిచయం చేసుకోవటం ప్రారంభించారు.

🔹ఆదికాండము 30:1.... ఇష్మాయేలియుల దగ్గరి నుండి యోసేపును పోతిఫర్ బానిసగా కొనుకున్నారు.
పోతిఫర్ కి యోసేపు బానిస, పాపం నుండి పారిపోగలిగిన యోసేపు పోతిఫర్ నుండి ఎప్పుడు పారిపోవాలని అస్సలు చూడలేదు. కారణం అమ్మబడిన వాడు కొన్న వానికి జీవితంతం సొంతం కనుక.

👉పౌలు గారు అంటున్నారు “”నేను యేసు క్రీస్తు దాసుడను” అని. . . .
🔹మరి పౌలును ఎవరు కొన్నారు ?
🔹ఎంత విలువ ఇచ్చి కొన్నారు....?

యేసుక్రీస్తు వారు ఇలా అంటున్నారు”మన్యుష్యకుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను” అని.... ( మత్తయి 20:28 ).

పాపం నుండి శాపం నుండి ధర్మశాస్త్ర సంబంధమైన సంకెళ్ళ నుండి సర్వమానవాళిని విడిపించుటకు యేసుక్రీస్తు వారు తన అమూల్యమైన రక్తమును విమోచన క్రయధనముగా ధారపోశారు. ( 1 తిమోతి 2:6 ).

అందువల్లనే మనం ఇప్పుడు పాపం విడచి దేవునికి దాసులమయ్యము. ( రోమా 6:22 )
మనం మన సొత్తు కాదు. ( 1 కోరింధి 6:19,20 ).

👉అందుకే పౌలు అంటున్నారు “నేను యేసుక్రీస్తు దాసుడను.... అయన తన రక్తముతో నన్ను కొన్నారు నేను ఆయనకు సొంతం... నేను అయన దాసుడను” అని....

నా ప్రియ స్నేహితులారా....

👉దాసుని గురించి యేసయ్య ఒక చక్కని వివరణ చెప్పారు.... లూకా సువార్త 17:7,8.
ఈ వాక్య భాగములో మనకి ఈ మాటలు కనిపిస్తాయి....
▪దాసునికి స్వచిత్తం ఉండదు, యజమాని చిత్తమే దాసుని విధి.
▪ దాసునికి సొంత పనులు ఉండదు, యజమాని పనే దాసుని విధి.
▪ దాసునికి సొంత అవసరతలు ఉండదు, యజమాని అవసరాలే దాసుని విధి.
▪ దాసునికి యజమాని మెప్పు ఉండదు, యజమానే దాసునికి మెప్పు.
యేసు క్రీస్తు వారు ఈ నాలుగు విషయాలు లూకా 17:7,8లో చెప్పటం మనం చూడవచ్చు.

గమనించండి.... 
👉సొంత చిత్తం లేని వాడు దాసుడు. పని చేసి మెప్పు ఆశించని వాడు దాసుడు. యజమాని ఆజ్ఞ దాసునికి సర్వస్వం. యజమాని అవసరతలే దాసుని విధులు.

అందుకే పౌలు అంటున్నారు....
▪ “నేను యేసుక్రీస్తు దాసుడను.... అయన చిత్తమే నా చిత్తం, అయన అవసరతలే నా అవసరతలు, ఆయనే నాకు మెప్పు” అని....

▪ఇంతలా తగ్గించుకోటానికి పౌలుగారికి ఎంత దేర్యం అండి.... అది కూడా తను పరిచర్య చేయటానికి వెళ్ళబోయే సంఘంతో ఈ మాటలు పలుకుతున్నారు.

👉పౌలు నేను బానిసను అంటుంటే.... 
▪నేడు అనేకులు.. 
నేను డాక్టర్...నేను రెవరెండ్... 
నేను అపోస్తలుడిని... నేను ప్ర్రవక్తను.... అని పరిచయం చేసుకోవటానికి ఎన్నో కష్టాలు పడుతున్నారు.

ఎవరినో విమర్శించాలి అని కాదుగాని.... ఒక మాట చెబుతాను....
వెల కొద్ది సంఘాలు, అంతకన్నా ఎక్కువ మంది సహా-సేవకులు, వందల ఆరాధాన గీతాలు, లక్షల కిలోమీటర్ల సువార్త యాత్రలు, లక్షలలో సంఘ విశ్వాసులు, రత్నాల వంటి  ఆత్మసంబంధమైన కుమారులను దేవుని కృపలో పొందుకున్న  మనిషి ఏసన్న గారు, చనిపోయేఅంత వరకు “బ్రదర్” గానే పిలువబడ్డారు.

నా ప్రియ స్నేహితులారా.... గమనించండి.

రోమా పత్రిక 6:16 లో ఇలా వ్రాయబడియున్నది....
“మీరు దేనికి లోబడతారో దానికి మీరు దాసులవుతారు” అని....
పౌలు గారు అంటారుమ
👉 “నేను యేసుక్రీస్తుకు లోబడువాడను ఆయనకు దాసుడను” అని....

👉ఈ మెలుకువ మనలో ఉందా....? 
👉పరీక్షించుకుని ముందుకు వెళ్దాము. . . .

ఆమేన్.ఆమేన్.ఆమేన్.
----------------------------------------------------------

Comments

Popular posts from this blog

పౌలు జీవిత చరిత్ర

ఉదయకాల ప్రార్ధన

ప్రసంగ సూత్రాలు