పౌలు జీవిత చరిత్ర

                                  పౌలు జీవిత చరిత్ర 
•••••••••••••••• క్రీస్తు తర్వాత స్థానాన్ని పౌలు గారికి ఇవ్వొచ్చు ఎందుకంటే ఇతడు పరిశుద్దాత్మ ద్వారా పలికిన ఒక గొప్ప మాట 

I కొరింథీయులకు 11 : 1 - "నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి"
 మీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి ఈ మాటను మీరు చెప్పగలరా..?? చెప్పగలిగితే మీరు ధన్యులు 

పౌలు:- కిలికియాలోని తార్సు పట్టణంలో జన్మించాడు క్రీ.శ 30  సం.ప్రభువైన  యేసు మరణం - ఆరోహణం - ఆదరణ కర్తయైన పరిశుద్దాత్మ భూలోకానికి పంపబడడం భూటకమని భావించాడు యవ్వనడైన పౌలు 
  తాను ఒక నిష్టగల పరిశుద్దుడు గాను, ఇస్రాయేలీయుడుగాను ధర్మశాస్త్రం(ఓల్డ testament) ప్రకారం అనింద్యుడిగాను జీవించి గమలియేలు పాదాల దగ్గర వేదాంత విద్యను అభ్యసించి క్రైస్తవ్యాన్ని రూపుమాపడం కోసం క్రైస్తవులను హింసిస్తున్నట్లుగా విశ్వసిన్చాడు "నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదములయొద్ద పెరిగి, మన పితరుల ధర్మశాస్త్రసంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, మీరందరు నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై యుండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణమువరకు హింసించితిని(అపో.కా 23:2-4)
స్తేఫేను ను రాళ్ళతో కొట్టి చంపించాడు(అపో.కా 7:60) ఈ తలంపుతోనే  దమస్కుకు వెళ్తూ మార్గంలో ప్రభువైన యేసు దర్శనాన్ని చూసి క్రీ.శ 32 న రక్షణ పొందాడు అరేబియాలో మూడేండ్లు గడిపి ప్రభువు హ్రుదయాన్ని  తెలుసుకున్నాడు సౌలు పౌలుగా మారాడు తర్వాత తార్సుకెల్లి చాలా కాలం సిరియా ,కిలికియా దేశాల్లో క్రీస్తు సువార్తను ప్రకటించాడు 

క్రీ.శ 46 లో అంతియోకయు సంఘంలో క్రీస్తు సువార్తకు అప్పగించబడ్డాడు క్రీ.శ 46 - 49 మొదటి సువార్త యాత్ర 50-53 లో రెండవ సువార్త యాత్ర మరియు 54-57 లో మూడవ సువార్త యాత్ర చేశాడు
  ఆ తర్వాత యేరుషలేములో బంధించబడి రెండేళ్లు కైసరయలోని కావలిలో గడిపారు క్రీ.శ 60 లో రోమునకు ప్రయాణం రోములో రెండేళ్ళు మొదటి చెర 61-62 కొద్ది కాలం విడిచిపెట్టబడినారు 63-64 అనేక ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటించాడు పిమ్మట రెండవ మారు (65-66) లో రోము చెరలో ఉన్నడు ఆపై 67 లో నీరో చక్రవర్తి ద్వారా శిరచ్చేదనచేయబడి హతసాక్శి అయ్యాడు పౌలు గారు బైబిల్ నందు 14 పత్రికలు రాసి సిలువవేయబడిన క్రీస్తును గూర్చిన మహా జ్ఞానాన్ని తేలియజేసాడు 

"అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము"(1కోరిన్థి 1:23)

 ఫిలిప్పీయులకు 1 : 21 - నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.

Comments

  1. ఇంతకు పౌలు గారు ఎవరిద్వారా నీరోకు అందించబడ్డాడు? 7738271920 మై నంబరు

    ReplyDelete
  2. 1 Corinthians(మొదటి కొరింథీయులకు) 7:8
    నావలెనుండుట వారికి మేలని పెండ్లికాని వారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను. ఈ వాక్యం ప్రకారం వివాహం కాలేదు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఉదయకాల ప్రార్ధన

ప్రసంగ సూత్రాలు