ఆదరించు వాక్యము

                                                 ఆదరించు వాక్యము

నా ప్రియ స్నేహితులారా.... లోకం మనలను ఆదరించలేదు.... ఈ లోకంలో దేనివల్లకూడా మనకి ఆదరణ లభించదు. అందుకే పరలోకం నుండి మనకు ఒక ఆదరణకర్త కావలసివచ్చింది.

ఆదరణలేమి అనేది నిరుత్సాహం నుండి పుడుతుంది.... నిరుత్సాహం ఓటమి నుండి ఏర్పడుతుంది. మనం ఏదో అనుకుంటాం, ఏదో చెయ్యాలని అనుకుంటాం, ఏదో అశిస్తాము.... అవి అన్ని జరగని పక్షమున ఈ నిరుత్సాహం పుడుతుంది.... దీనివల్ల మనలో ఉన్న ఆ కొద్ది ఆదరణ కూడా కోల్పోయే పరిస్థితులు వస్తుంటాయి.

ఈ మాట గమనించండి.... ఓడిపోవటం తప్పు కానే కాదు అండి....
చాలా మంది పెద్దవాళ్ళు ఇదే చెబుతుంటారు.... పడిపోవటం తప్పు కాదు.... ఓడిపోవటం తప్పుకాదు.
పడిపోయినా వెంటనే తిరిగిలేవలేకపోవటం తప్పు.... ఓటమిలోనుంచి గెలుపు కొరకు పాఠాలు నేర్చుకోకపోవటం తప్పు.
అవును... ఓటమి మనకి నేర్పే గెలుపు పాఠాలు మనం నేర్చుకోవాలి....
ఓడిపోయినప్పుడు మరో అవకాశం వస్తే ఎలా గెలవాలి అనే విషయం మీదే మన దృష్టి నిలిచివుండాలి.

ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి నేను....
ఓటమి ఎప్పుడు బాధగానే ఉంటుంది.... నాకు తెలుసు.
ఓడిపోయినప్పుడు.... పడిపోయినప్పుడు.... భుజంతట్టి ఆదరించేవారు లేని క్షణం అది ఏంత మనోవేదనను కలిగిస్తుందో నాకు అనుభవపూర్వకంగా తెలుసు. నిజమే నిరుత్సాహం బాధని కలిగిస్తుంది.
ఆదికాండము 15వ అధ్యాయము.... “నిన్ను గొప్ప జనముగా” చేస్తాను అని దేవుడు అబ్రహముతో వాగ్దానం చేసి అప్పటికి 10 సం!!రాల పైనే అవుతుంది.... ఆ వాగ్దానం నెరవేర్పులోనికి ఇంకా రాలేదు.
అబ్రహాము స్వదేశాన్ని విడిచి వచ్చేసారు ... తన వారిని విడిచివచ్చేసారు... పరదేశిలాగా గుడారంలో చేరారు... అయినా తనకి ఇవ్వబడిన వాగ్దానం నెరవేర్పులోనికి ఇంకా రాలేదు. 
పది సం!!రాలు దాటింది.... అబ్రములో భయం, అబద్రతాభావం, ఈ వాగ్దానం ఈ బహుమానం నేను పోదుకోగాలనా? అనే ప్రశ్న, అన్నిటికి మించి ప్రయోజనం లేనివి అన్ని ఉన్నాయి కానీ సంతానం లేదు అనే నిరుత్సాహం. అబ్రహాము ఒంటరిగా మారిపోయారు.... తనకి ఒకేఒక్క ఆత్మీయుడు లోతు దగ్గరగా లేడు, దేవుని వాగ్దానం పై మేలుకువలేని భార్య శారాయి; హగారుతో పోయి “నాకు సంతానం ఇవ్వు” అని తొందరపెడుతుంది.
ఆ క్షణం అబ్రహాము నిజంగానే ఒంటరిగా మారిపోయారు.... అబ్రహాముకి అన్ని ఉన్నాయి, నిజంగా అన్ని ఉన్నాయి.... ఆస్తి ఉంది, పేరు ఉంది, పనివారు ఉన్నారు, పశుసంపద ఉంది, 318 మంది యుద్ధవీరులవంటి సొంత సేన్యం ఉంది, అన్నిటిని నమ్మకంగా చూసుకునే పెద్దదాసుడు ఉన్నాడు. ఆదరణ తప్ప అన్ని ఉన్నాయి.

అప్పుడు అబ్రహాముకి ఒక దర్శనం కలిగింది.... ఆ దర్శనం గురించి బైబిల్లో ఇలా వ్రాయబడియుంది.... అది 15:1....”యెహోవా వాక్యము అబ్రహాముగారి దగ్గరికి పంపబడింది.”
గమనించండి... పంపబడింది ఏమిటి....“ యెహోవా వాక్యము “.
ఆ వాక్యము అబ్రహాముని దర్శించింది.... భయపడకు అని ధైర్యపరచింది... నేను నీకు కేడెము అని బలపరచింది... నీ బహుమానము అధికము అగును అని ప్రోతహించింది... ఒంటరిగా తన గుడారంలో ఉన్న అబ్రహాముని బయటకి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలను చూపించి వాగ్దానాన్ని తిరిగి జ్ఞాపకం చేసి అబ్రహాముని తిరిగి ఉజ్జీవింపజేసింది... ఆ వాక్యమే అబ్రహాము వాగ్దానాన్ని శాశ్వత నిబంధనగా మార్చింది... అదికాండము 15 అధ్యాయంలో చూస్తే ఈ విషయాలు మీకు మరింతగా అర్ధం అవుతాయి.

భయముతో, నిరుత్సాహంతో, ఆదరణ లేక ఉన్న అబ్రహాముని దర్శించి, ప్రోచ్చహించి, తిరిగి ఉజ్జీవింపచేసింది దేవునివాక్యం.

దేవుని వాక్యం ఆదరించు వాక్యం.
బైబిల్ లో మనకోసం ఎన్నో వాగ్ధానాలు ఉన్నాయి....
బైబిల్ లో యేసయ్య మనకోసం ఎన్నో బహుమానాలు దాచి ఉంచారు....
ఆ వాగ్ధానాలు పొందుకోలేక.... దేవుడు దాచి ఉంచిన మేలులు కనుగొనలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. హాగరులాంటివారు. ఈ హగారు కూడా అరణ్యంలో అటుఇటు తిరిగింది కానీ తన కళ్ళముందు ఉన్న నీటి ఊటను చూడలేకపోయింది.

మీకు సమాధానం కరవైయిందా....? సమాధానం కోసం అటు ఇటు తిరుగకు.... అసలైన సమాధానం యేసు మాత్రమే ఇవ్వగలరు. ఆదరణ కోసం మనుషుల వెంట పరుగెత్తకు.... యేసు మాటలు; దేవుని వాక్యం మాత్రమే అసలైన ఆదరణను ఇవ్వగలదు. 
ఆదరణకరువైన ఏలాంటి పరిస్థితిలోనైనా.... దేవుని వాక్యం మనలను పురికోల్పి, తిరిగి ఉజ్జీవింపజేయగలదు.... ఆ సజీవమైనవాక్యం మీ ముందే ఉంది, మీ దగ్గరే ఉంది. దేవుని వాక్యనికి మరింత దగ్గరిగా చేరండి.... శ్రేష్టమైన ఆదరణను మీరు పొందుకుంటారు.

హల్లెలూయ. . . .

మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువులవారి నామంలో చేయబడిన ఈ ప్రకటన ప్రకారముగాను మిమ్మును వాక్యంలో స్థిరపరచుటకు మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
ఆమేన్‌. ఆమేన్. ఆమేన్.

Comments

Post a Comment

Popular posts from this blog

పౌలు జీవిత చరిత్ర

ఉదయకాల ప్రార్ధన

ప్రసంగ సూత్రాలు