'బలహీనుడను అనుకుంటున్నావా?'
'బలహీనుడను అనుకుంటున్నావా?'
🌱ఒక ప్రసంగీకుని మాటలు వింటున్నప్పుడు, నేనట్లా ప్రసంగించలేక పోతున్నానే?
🌱ఒక సింగర్ పాడుచున్నప్పుడు, నేనట్లా పాడలేక పోతున్నానే?
🌱ఒక మ్యుజిషియన్ వాయిస్తున్నప్పుడు, నాకట్లాంటి నైపుణ్యములేవి లేవే? ... అంటూ
వాళ్ళనీ వీళ్ళనీ పోల్చుకొని కృంగిపోయేవారు కొందరైతే? వాళ్ళనీ వీళ్ళని పోల్చుకొని వారికున్న తలాంతులను చూచి పొంగిపోయేవారు మరి కొందరు.
🌱ఎవ్వరితోనూ నీవు పోల్చుకోనవసరం లేదు. ఎందుకంటే? నీలాంటి వారు ఈలోకంలో ఎవ్వరూలేరు.
🌱ఒక తల్లికి పుట్టిన కవలలో కూడా చెప్పలేనన్ని వ్యత్యాసాలు. నీకు నీవే ప్రత్యేకం.
🌱నిన్ను ప్రత్యేకంగా దేవుడు సృష్టించాడు. నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగియున్నాడు. 🌱అట్లాంటప్పుడు? నేను చేతకానివాడిని, చేతకానిదానను అంటూ ఎందుకు కృంగిపోతున్నావ్?
🍃ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింప కుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్ని కలేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు.
📖1 కొరింది 1: 27-29
🍃దేవుడు నిన్ను వాడుకోవడానికి నీకున్న జ్ఞానం, నీకున్న తలాంతులే కారణం అనుకోవడం అవివేకం. నీకు ఆరోగ్యంవున్నా-లేకున్నా, చదువున్నా-లేకున్నా, బాస్ వి అయినా-సాతానుకు బానిసవైనా , మాటకారివైనా-నత్తివాడవైనా, చిన్న వాడవైనా - పెద్దవాడవైనా,
నీస్థితి ఏదయినా సరే 'నీవు ఆయనకు కావాలి'.
🍃షోమ్రోను పట్టణం, ఆకలితో అల్లాడిపోతున్న ప్పుడు, వారి ఆకలిని తీర్చడానికి దేవుడు "కుష్టురోగులను" ఏర్పాటు చేసుకున్నాడు.
📖2 రాజులు 7:9
🍃ఇశ్రాయేలీయులు, ఐగుప్తు దాస్యములో మ్రగ్గిపోతున్న
ప్పుడు, వారిని విడిపించడానికి "నత్తివాడైన" మోషేను నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
📖నిర్గమ 4:10
🍃ఐదు వేలమంది ఆకలిని తీర్చడానికి 'చిన్నవాడు' తెచ్చిన 'చిన్న ఆహారము'నే ప్రభువు వారు వాడుకున్నారు.
📖యోహాను 6:9
🍃సైన్యాధ్యక్షుడైన నయమాను కుష్టురోగము బాగుపడడానికి బానిసయైన 'చిన్నది' ఇశ్రాయేలు దేవుని శక్తిని గూర్చి ఇచ్చిన సమాచారమే కారణమయ్యింది.
📖2 రాజులు 5:4
🍃యుద్ధ శూరుడైన గొల్యాతును సంహరించడానికి 'బాలుడైన' దావీదును, 'ఒడిసెలు' ను ఆయుధంగా ఎన్నుకున్నాడు.
📖1 సమూయేలు 17:33
🍃యేసు ప్రభువు వారు తన రాజ్య సువార్తను వ్యాప్తి చెయ్యడానికి చేపలపట్టు 'జాలరులను' తన శిష్యులుగా ఎన్నుకున్నాడు.
📖మత్తయి 10:2
🍃యేసుప్రభువు వారు తన ప్రయాణానికి హేరోదు గుర్రాలనుకాదు వాడుకున్నది. కట్టబడిన 'గాడిదపిల్ల' ఆయనకు కావలసి వచ్చింది.
📖మార్కు 11:2
🌴అవును! సాతాను కట్లచే బంధించబడిన నీవే ఆయనకు కావాలి. యేసును మోసిన ఆ గాడిద పిల్లవు నీవే కావాలి.
🍃ఆశ గల ప్రాణమును త్రుప్తిపరచుదును అని దేవుని వాక్యం సెలవిస్తుంది
📖(కీర్తనలు 107:9).
🌴నీవు దేవుని పనిలో వాడబడాలి, ఒక బలమైన సాధనముగా వుండాలి అని ఆశ పడితే నిన్ను అయన పాపం నుండి విడిపించి, నీ బలహీనతల యందు నీకు బలం ఇచ్చి, తన కృప చేత నిన్ను బలముగా వాడుకొంటాడు.
👉🏾పైన చదివారు కదా, దేవుడు ఎలాంటి వారిని తన సాధనముగా వాడుకున్నారో, కనుక నీ బలహీనతలను చూసి క్రుంగిపోకుండా, ప్రభువా నన్ను నీ సాధనముగా వాడుకో అని విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించు, దేవుడు తప్పక నిన్ను తన సాధనముగా వాడుకొంటాడు.
🌴నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను.
📖ఫిలిప్పీయులకు 4:13
🙏🏼ఆమెన్! ఆమెన్! ఆమెన్!

Praise the lord
ReplyDelete